Apr 21 2021 @ 12:34PM

షాక్‌ ఇచ్చిన డైరెక్టర్‌తో రవితేజ...!

టాలీవుడ్‌ కమర్షియల్‌ డైరెక్టర్స్‌ల్లో తనదైన పంథాను క్రియేట్‌ చేసుకున్నాడు హరీశ్‌ శంకర్‌. ఈ డైరెక్టర్‌ కెరీర్‌ 'షాక్‌' సినిమాతో స్టార్ట్‌ అయ్యింది. ఆ సినిమా హరీశ్‌ శంకర్‌కి, రవితేజకి సక్సెస్‌ పరంగా షాకిచ్చింది. అయితే ఆ వెంటనే హరీశ్‌ శంకర్‌..రవితేజతోనే 'మిరపకాయ్‌' అనే సినిమాను తెరకెక్కించి సూపర్‌ డూపర్ హిట్‌ అందుకున్నాడు. ఆ తర్వాత పవన్‌కళ్యాణతో గబ్బర్‌ సింగ్‌ వంటి ఇండస్ట్రీ హిట్‌ కూడా తీశాడు. అలా సక్సెస్‌ఫుల్‌గా ఇండస్ట్రీలో రాణిస్తోన్న హరీష్‌ శంకర్‌ తదుపరి చిత్రాన్ని పవన్‌కళ్యాణ్‌తో చేయబోతున్న సంగతి కూడా తెలిసిందే. కాగా.. లేటెస్ట్‌గా ఈ స్టార్‌ డైరెక్టర్‌ తనకు డైరెక్టర్‌గా ఛాన్స్ ఇచ్చిన మాస్‌ మహారాజా రవితేజతో సినిమా చేయబోతున్నాడనే వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. రీసెంట్‌గా రవితేజను కలిసి హరీశ్‌ శంకర్‌ కథను వినిపించాడట. రవితేజ కూడా ఓకే చెప్పాడని టాక్‌. పవన్‌కళ్యాణ్‌తో సినిమా పూర్తయిన తర్వాత రవితేజ, హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందంటున్నారు మరి.