Oct 24 2021 @ 04:06AM

ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయింది

రవితేజ కథానాయకుడిగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ధమాకా’. యాక్షన్‌ ఎంటర్టైనర్‌గా  తెరకెక్కుతున్న ఈచిత్రం షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. తాజాగా ‘ధమాకా’ తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో రవితేజ రెండు పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. రవితేజ నటించిన ‘ఖిలాడి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఆయన ‘ధమాకా’ తో పాటు శరత్‌ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్‌డ్యూటీ’ చిత్రం చేస్తున్నారు.