May 17 2021 @ 01:23AM

రవితేజకు నచ్చింది కానీ...

ధనుష్‌ కథానాయకుడిగా నటించిన తమిళ సినిమా ‘వడా చెన్నై’. అందులో గ్యాంగ్‌స్టర్‌ రాజన్‌ పాత్రలో తమిళ నటుడు అమీర్‌ సుల్తాన్‌ నటించారు. అయితే, ఆయన దగ్గరకు వెళ్లడానికి ముందు ఆ పాత్ర రవితేజ దగ్గరకు వచ్చింది. హీరోకి నచ్చిప్పటికీ... ఇతర చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయారని దర్శకుడు వెట్రి మారన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘రాజన్‌ పాత్రలో విజయ్‌ సేతుపతి నటించాల్సింది. ఆయనకు స్ర్కిప్ట్‌ వినిపించా. నచ్చిందని అన్నారు. సినిమా చేయడానికి కూడా అంగీకరించారు. అయితే, అప్పటికే ఆయన అంగీకరించిన సినిమా షెడ్యూల్స్‌, మా సినిమా షెడ్యూల్స్‌ క్లాష్‌ అవ్వడంతో చేయలేకపోయారు. తర్వాత రవితేజను సంప్రదించా. పాండిచ్చేరిలో ఆయన ఓ సినిమా షూటింగ్‌ చేస్తుంటే... వెళ్లి కథ చెప్పా. ఆయనకూ కథ నచ్చింది. బిజీగా ఉండటంతో చేయలేకపోయారు. ఆ తర్వాత అమీర్‌ను సంప్రదించగా... కథ వినకుండా ఓకే చెప్పారు’’ అని క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెట్రి మారన్‌ వివరించారు.