Abn logo
Oct 19 2020 @ 01:01AM

రవితేజ ‘ఖిలాడి’ షురూ!

Kaakateeya

రవితేజ కథానాయకుడిగా రమేశ్‌ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో మొదలైంది. ‘ప్లే స్మార్ట్‌’ అన్నది ట్యాగ్‌లైన్‌. ముహూర్తపు సన్నివేశానికి హవీశ్‌ క్లాప్‌ ఇవ్వగా, శ్రీనివాసరాజు కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. నవంబర్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెడతాం’’ అని అన్నారు. రవితేజ డ్యూయల్‌ రోల్‌ చేస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి నాయికలు. జయంతీలాల్‌ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, సినిమాటోగ్రఫీ: సుజిత్‌ వాసుదేవ్‌.

Advertisement
Advertisement
Advertisement