సర్వే ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా రవిశేఖర్‌

ABN , First Publish Date - 2022-01-24T05:35:52+05:30 IST

సర్వే ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా రవిశేఖర్‌ను ఎన్నుకున్నారు.

సర్వే ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా రవిశేఖర్‌
రవిశేఖర్‌

తొట్టంబేడు, జనవరి 23: సర్వే ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా రవిశేఖర్‌ను ఎన్నుకున్నారు. ఆదివారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో సర్వే ఎంప్లాయీస్‌ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తొట్టంబేడు మండల సర్వేయర్‌గా పనిచేస్తున్న రవిశేఖర్‌ను సర్వే ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగానూ, పదిమందిని కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిని సమావేశానికి హాజరైన సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. 

Updated Date - 2022-01-24T05:35:52+05:30 IST