నువ్వు లెజెండ్‌!

ABN , First Publish Date - 2020-04-04T09:41:17+05:30 IST

ధోనీ సారథ్యంలో భారత జట్టు వన్డే వరల్డ్‌కప్‌ (2011) అందుకొని తొమ్మిదేళ్లయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని టీమిండియా ప్రస్తుత కోచ్‌..

నువ్వు లెజెండ్‌!

యువీకి రవి ప్రశంస

న్యూఢిల్లీ: ధోనీ సారథ్యంలో భారత జట్టు వన్డే వరల్డ్‌కప్‌ (2011) అందుకొని తొమ్మిదేళ్లయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని టీమిండియా ప్రస్తుత కోచ్‌, అప్పటి కామెంటేటర్‌ రవిశాస్ర్తి..నాడు శ్రీలంకతో ఫైనల్లో 48వ ఓవర్‌ రెండో బంతికి ధోనీ సిక్సర్‌ కొట్టి టీమిండియాకు చారిత్రక విజయాన్ని అందించిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ‘యువకులకు కంగ్రాట్స్‌. 1983 ప్రపంచకప్‌ గెలిచిన సందర్భం మాకు ఎంతో మధురం. అలాగే ఈ అపురూప క్షణాలు మీకు జీవితాంతం గుర్తుండి పోతాయి’ అని రాశాడు. సచిన్‌, కెప్టెన్‌ కోహ్లీని ట్యాగ్‌ చేశాడు. అయితే, ఆ ఫైనల్లో ధోనీతో పాటు నాన్‌స్ట్రయికర్‌ ఎండ్‌లో ఉన్న యువరాజ్‌ ‘థ్యాంక్యూ సీనియర్‌. ఆ అద్భుత విజయంలో భాగస్వామ్యమైన నన్ను, మహీని మరిచావు’ అని రవిశాస్ర్తి ట్వీట్‌కు సరదాగా స్పందించాడు. ఇందుకు రవిశాస్ర్తి ‘వరల్డ్‌కప్‌ విషయానికి వస్తే నువ్వు జూనియర్‌వి కాదు. లెజెండ్‌వి’ అని బదులిచ్చాడు. 

Updated Date - 2020-04-04T09:41:17+05:30 IST