Abn logo
Mar 2 2021 @ 11:49AM

టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రికి కరోనా టీకా

అహ్మదాబాద్ (గుజరాత్): టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి మంగళవారం ఉదయం కొవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకున్నారు. అహ్మదాబాద్ నగరంలోని అపోలో ఆసుపత్రిలో రవిశాస్త్రి (58) వ్యాక్సిన్ వేయించుకున్నారు. ‘‘నేను కొవిడ్ వ్యాక్సిన్ -19 మొదటి డోస్ వేయించుకున్నాను, కరోనా నిరోధానికి వైద్యశాఖ నిపుణులు, శాస్త్రవేత్తలు కలిసి చేసిన కృషికి అభినందనలు’’ అంటూ వ్యాక్సిన్ వేయించుకుంటున్న చిత్రాన్నిపంచుకుంటూ రవిశాస్త్రి ట్వీట్ చేశారు.రవిశాస్త్రి ఇంగ్లాండు దేశంతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ సందర్భంగా భారత క్రికెట్ జట్టుకు కోచ్ గా సేవలు అందిస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement