Ravi పచ్చముత్తుకు మరో గౌరవ డాక్టరేట్‌

ABN , First Publish Date - 2022-07-15T15:43:27+05:30 IST

ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ప్రొ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ రవి పచ్చముత్తును మరో గౌరవ డాక్టరేట్‌ వరించింది. ఇప్పటికే ఆయనకు ఒక గౌరవ డాక్టరేట్‌ ఉండగా,

Ravi పచ్చముత్తుకు మరో గౌరవ డాక్టరేట్‌

చెన్నై, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ప్రొ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ రవి పచ్చముత్తును మరో గౌరవ డాక్టరేట్‌ వరించింది. ఇప్పటికే ఆయనకు ఒక గౌరవ డాక్టరేట్‌ ఉండగా, తాజాగా మలేసియాకు చెందిన లింకన్‌ యూనివర్సిటీ కళాశాల నిర్వాహకులు గురువారం చెన్నైలో జరిగిన కార్యక్రమంలో రెండవ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. విద్య, సమాజ అభ్యున్నతికి ఆయన అందిస్తున్న సేవలు, అసాధారణ కృషికి గుర్తుగా ఈ గౌరవ డాక్టరేట్‌ అందిస్తున్నట్లు లింకన్‌ యూనివర్సిటీ కాలేజ్‌ ప్రెసిడెంట్‌, ప్రొఫెసర్‌ డాక్టర్‌ అమియా భౌమిక్‌ ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఆర్‌ఎం వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ సి.ముత్తమిళ్‌సెల్వన్‌, ప్రొ వైస్‌ఛాన్స్‌లర్‌ లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ డాక్టర్‌ ఎ.రవికుమార్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎస్‌.పొన్నుస్వామి, డిప్యూటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ డి.ఆంటొనీ అశోక్‌కుమార్‌, ఇంటర్నేషనల్‌ డైరెక్టర్‌ కర్తార్‌సింగ్‌ తదితరులు  పాల్గొన్నారు.

Updated Date - 2022-07-15T15:43:27+05:30 IST