‘కేజీఎఫ్ చాప్టర్ 2’లో కనిపించనున్న రవీనా టాండన్... సేమ్ ఫ్రాంఛైజ్‌లో గతంలో వచ్చిన ఫస్ట్ మూవీలోనూ తనని నటించమని ఫిల్మ్ మేకర్స్ అడిగినట్టు తాజాగా తెలియజేసింది. ‘కేజీఎఫ్ చాప్టర్ 1’ 2018లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
‘‘హీరో చుట్టూ నడిచే కథతో సాగే ఓ ఫ్రాంఛైజీలో నటించాలా వద్దా అన్న సందేహం నాకు అప్పట్లో ఉండేది. అందుకే, పార్ట్ వన్‌లో వాళ్లు నా బాడీ డబుల్ని ఉపయోగించుకున్నారు’’ అని చెప్పింది రవీనా. రాబోయే ‘కేజీఎఫ్ చాప్టర్ 2’లో తనది కీలక పాత్ర అని కూడా ఆమె పేర్కొంది. అయితే, ఆ క్యారెక్టర్ గురించిన ఇతర వివరాలేవీ రవీనా వెల్లడించలేదు.
‘కేజీఎఫ్ 2’ నిజానికి ఎప్పుడో విడుదల కావాలి. కానీ, పదేపదే కరోనా ఎఫెక్ట్ తగులుతుండటంతో వాయిదా పడుతూ వస్తోంది. 2022లో ఎలాగైనా బ్లాక్‌బస్టర్ సీక్వెల్‌ని రిలీజ్ చేసే ప్రయత్నాల్లో ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు. కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్ 2’కి దర్శకుడు ప్రశాంత్ నీల్ కాగా బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ప్రతినాయకుడుగా నటించాడు...