Oct 28 2021 @ 11:00AM

ఆ సినిమా సెట్స్‌లో Salman Khan, నేను తిట్టుకుంటూనే ఉండేవాళ్లం.. నాతో ఎప్పటికీ కలిసి పనిచేయనన్నాడు: Raveena Tandon

బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ రవీనా టాండన్. సల్మాన్ హీరోగా 1991లో తెరకెక్కిన `పత్తర్ కే పూల్` సినిమాతో రవీనా తెరంగేట్రం చేసింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్, రవీనా తరచుగా గొడవ పడుతూ ఉండేవాళ్లట. ఇక, ఎప్పటికీ రవీనాతో పనిచేయనని సల్మాన్ అందరికీ చెప్పేవాడట. ఆ విషయాలను రవీనా తన తాజా ఇంటర్వ్యూలో పంచుకుంది. 


`నా తొలి సినిమా సమయానికి నా వయసు 16, సల్మాన్ వయసు 23. సినిమా షూటింగ్ సమయంలో చిన్న పిల్లల్లా మేం ప్రతి విషయానికీ గొడవ పడేవాళ్లం. సల్మాన్ తండ్రి సలీమ్, మా నాన్న మంచి స్నేహితులు. కాబట్టి, సల్మాన్ నాకు చిన్నప్పటి నుంచే తెలుసు. అప్పట్నుంచే మాకు పడేది కాదు. ఇంటి దగ్గర గొడవలనే సెట్స్ పైకి కూడా తీసుకెళ్లే వాళ్లం. దాంతో ఇక ఎప్పటికీ నాతో కలిసి పని చేయకూడదని సల్మాన్ అనుకున్నాడు. అయితే అది కుదరలేదు. మా కాంబినేషన్‌లోనే `అందాజ్ ఆప్నా ఆప్నా` వంటి బ్లాక్‌బస్టర్ సినిమా వచ్చింది. ఆ తర్వాత `కహిన్ ప్యార్ న హో జాయే` సినిమాలో కూడా కలిసి నటించామ`ని రవీనా చెప్పింది.  


Bollywoodమరిన్ని...