'రావణలంక' ట్రైలర్ విడుదల..

ఈ మధ్యకాలంలో తక్కువ బడ్జెట్‌తో మంచి కథ.. కథనాలతో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అలాంటి మరో సినిమా ఇప్పుడు రూపొందుతోంది. బి.ఎన్.ఎస్ రాజు ద‌ర్శ‌కత్వంలో క్రిష్, అశ్విత, త్రిష హీరోహీరోయిన్స్‌గా 'రావ‌ణలంక‌' అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని కే సిరీస్ మూవీ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై క్రిష్ బండిప‌ల్లి నిర్మిస్తున్నారు. యాక్ష‌న్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందుతున్న ఇందులో ముర‌ళి శ‌ర్మ‌, దేవ్ గిల్ ఇతర ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. తాజాగా చిత్రబృందం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది.

ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే వరుస హత్యల నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఆద్యంతం ఉత్కంఠభరితంగా తెరకెక్కించినట్టు తెలుస్తోంది. యాక్షన్ సీన్స్‌తో పాటు సినిమాలో రొమాంటిక్ సీన్స్ కూడా బాగానే ఉన్నట్టు అనిపిస్తోంది. మొత్తంగా 'రావ‌ణలంక‌' ట్రైలర్ మాస్ అండ్ యూత్ ఆడియన్స్‌ను థియేటర్స్‌లో బాగానే ఎంటర్‌టైన్ చేస్తుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది. చూడాలి మరి ఈ యాక్ష‌న్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో. 


Advertisement