రావణ వాహనంపై సంగమేశ్వరుడి గ్రామోత్సవం

ABN , First Publish Date - 2021-04-13T03:53:36+05:30 IST

: కామాక్షితాయి సంగమేశ్వర బ్రహ్మోత్సవాల్లో బాగంగా ఆదివారం అర్ధరాత్రి రావణ వాహనంపై సంగమేశ్వరుడి గ్రామోత్సవం నిర్వహించారు

రావణ వాహనంపై సంగమేశ్వరుడి గ్రామోత్సవం
రావణసేవలో సంగమేశ్వరుడు

  మనుబోలు, ఏప్రిల్‌ 12: కామాక్షితాయి సంగమేశ్వర బ్రహ్మోత్సవాల్లో బాగంగా ఆదివారం అర్ధరాత్రి రావణ వాహనంపై సంగమేశ్వరుడి గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయంలో మూలవర్లకు పంచామృతాభిషేకాలు, కుంకుమ పూజలను ఆలయ అర్చకులు మాకుల మనోజ్‌శర్మ, సాయిశర్మలు నిర్వహించారు. ఈ  కార్యక్రమాలకు తుమాటి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మణికంఠారెడ్డి దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఉత్సవంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. గ్రామోత్సవంలో పందిళ్లు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.


Updated Date - 2021-04-13T03:53:36+05:30 IST