సకాలంలో రేషన్‌ పంపిణీ చేయాలి

ABN , First Publish Date - 2022-05-27T05:00:09+05:30 IST

సకాలంలో రేషన్‌ పంపిణీ చేయాలని డీఎ్‌సవో రఘురాం, తహసీల్దార్‌ మహమ్మద్‌ చాంద్‌ గురువారం పేర్కొన్నారు. మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో 26 మంది డీలర్లతో సమావేశం నిర్వహించారు. నిత్యావసర సరుకులకు సకాలంలో డీడీలు చెల్లించి సక్రమంగా పంపిణీ చేయలన్నారు.

సకాలంలో రేషన్‌ పంపిణీ చేయాలి
డీలర్ల సమావేశంలో మాట్లాడుతున్న తహసీల్దార్‌

చిన్నమండెం, మే 26: సకాలంలో రేషన్‌ పంపిణీ చేయాలని డీఎ్‌సవో రఘురాం, తహసీల్దార్‌ మహమ్మద్‌ చాంద్‌ గురువారం పేర్కొన్నారు. మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో 26 మంది డీలర్లతో సమావేశం నిర్వహించారు. నిత్యావసర సరుకులకు సకాలంలో డీడీలు చెల్లించి సక్రమంగా పంపిణీ చేయలన్నారు. ఎండీ ఆపరేటర్లు బియ్యం ప్రజలకు ఇబ్బంది లేకుండా పంపిణీ చేయాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిప్యూటీ తహసీల్దార్‌, డీలర్లు, ఎండీ ఆపరేటర్లు, డీటీ రెడ్డెన్న, వీఆర్‌వోలు పాల్గొన్నారు. 


సంబేపల్లెలో: 

ప్రతి నెల 1వ తేదీ నుంచే బియ్యం పంపిణీ జరగాలని డీఎ్‌సవో రఘురాం గురువారం తెలిపారు. తహసీల్దార్‌ కార్యాలయంలో డీలర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి చౌకదుకాణం వద్ద బోర్డులు ఉండాలని, అందులో వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని తెలియజేశారు. నిత్యావసర సరుకుల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సంజీవరెడ్డి, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ కృపావతి, గోడౌన్‌ డీటీ రామ, నాగాంజనేయరెడ్డి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-27T05:00:09+05:30 IST