CC cameras: రేషన్‌ దుకాణాల్లో సీసీ కెమెరాలు

ABN , First Publish Date - 2022-09-16T13:46:57+05:30 IST

రేషన్‌ దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి రేషన్‌ బియ్యం(Ration rice) చోరీకి అడ్డుకట్ట వేసేలా చర్యలు చేపట్టినట్లు ఆహార, వినియోగదారుల

CC cameras: రేషన్‌ దుకాణాల్లో సీసీ కెమెరాలు

                           - ఆహార భద్రత శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి డాక్టర్‌ రాధాకృష్ణన్‌


 పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 15: రేషన్‌ దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి రేషన్‌ బియ్యం(Ration rice) చోరీకి అడ్డుకట్ట వేసేలా చర్యలు చేపట్టినట్లు ఆహార, వినియోగదారుల భద్రత శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి డా. రాధాకృష్ణన్‌(Dr. Radhakrishnan) తెలిపారు. తిరువళ్లూర్‌ జిల్లా ఊత్తుకోట ప్రాంతంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం పరిశీలించిన డా.రాధాకృష్ణన్‌ విలేఖరులతో మాట్లాడుతూ, ఆంధ్ర సహా పొరుగు రాష్ట్రాలకు రేషన్‌ బియ్యం అక్రమ తరలింపు అడ్డుకొనేలా చర్యలు చేపట్టామన్నారు. రేషన్‌ దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి బియ్యం చోరీలను అడ్డుకుంటామని తెలిపారు. ప్రస్తుత సీజన్‌లో మిగతా రాష్ట్రాలకన్నా ధాన్యం కొనుగోలు అధికంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో 109 బహిరంగ గోదాముల్లో వసతుల కల్పన, 20 శాశ్వత గోదాముల నిర్మాణానికి ముఖ్యమంత్రి రూ.238 కోట్లు కేటాయించారని రాధాకృష్ణన్‌ తెలిపారు.

Updated Date - 2022-09-16T13:46:57+05:30 IST