కేరాఫ్‌ సూరాపురం

ABN , First Publish Date - 2022-01-18T05:58:10+05:30 IST

నిడదవోలు మండలంలో సూరా పురం ఒక గ్రామం. ప్రభుత్వం ప్రతినెలా పేదలకు రేషన్‌ ద్వారా అందించే రేషన్‌ బియ్యాన్ని ఈ గ్రామంలో రేషన్‌ మా ఫియా అడ్డదారిన కొనేసి దొడ్డిదారిన విక్రయాలు సాగిం చేస్తుంటుంది.

కేరాఫ్‌ సూరాపురం
రేషన్‌ బియ్యాన్ని మోపెడ్‌పై తరలిస్తున్న వ్యాపారి

రేషన్‌ బియ్యం అక్రమాలకు అడ్డా

కుటీర పరిశ్రమగా  దందా

వివిధ గ్రామాల నుంచి నిత్యం కొనుగోళ్లు

బైక్‌లు, ఆటోలపై తరలింపు

రెవెన్యూ అధికారులకు కనిపించని అక్రమ రవాణా 


సూరాపురం సుమారు 1300 మంది జనాభా ఉన్న చిన్న గ్రామం. జిల్లాలో ఈ గ్రామం పేరు చాలా మందికి తెలియదు. కానీ జిల్లా విజిలెన్స్‌ అధికారులు మాత్రం ఎప్పుడూ ఈ గ్రామంపై ఒక కన్నేసి ఉంచుతారు. కారణం ఈ గ్రామంలో ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రేషన్‌ బియ్యాన్ని దొడ్డిదారిన కొనేసి రాత్రికి రాత్రే రవాణా వాహనాల ద్వారా తరలించేసే ఒక కుటీర పరిశ్రమగా దందా సాగుతోంది. ఒకరో ఇద్దరో కాదు.. చాలా మంది ఇదో ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. ఆంధ్రజ్యోతి పరిశీలనలో తేలిన విషయాలివి.


నిడదవోలు, జనవరి 17 : నిడదవోలు మండలంలో సూరా పురం ఒక గ్రామం. ప్రభుత్వం ప్రతినెలా పేదలకు రేషన్‌ ద్వారా అందించే రేషన్‌ బియ్యాన్ని ఈ గ్రామంలో రేషన్‌ మా ఫియా అడ్డదారిన కొనేసి దొడ్డిదారిన విక్రయాలు సాగిం చేస్తుంటుంది. స్థానిక అధికార్లకు ముడుపులు పక్కాగా అం దించేయడంతో ఎటువంటి సమాచారం వచ్చినా వారి చెవిన పడదు. జిల్లా విజిలెన్స్‌ అధికారులు మాత్రం నేరుగా ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి ఈ గ్రామంలో రేషన్‌ బియ్యం అడ్డాలపై దాడులు చేసి భారీగానే బియ్యం పట్టు కుని కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లా అధికారులు గ్రామానికి వస్తున్నారన్న సమాచారంతో రేషన్‌ బియ్యాన్ని ముందుగానే గ్రామం దాటించేస్తుంటారు. ప్రతినెలా 2వ తేదీ నుంచి 20వ తారీఖు వరకు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల లోపుగా సైకిళ్లు, మోపెడ్‌లు, ఆటోలపైనా రేషన్‌ బియ్యం మూటలుగా ఈ గ్రామంలోకి వెళ్లిపోతాయి. ఇక రాత్రి అయితే చాలు ఈ మూటలన్నీ బస్తాలాగా మారి స్థాని కంగా ఉన్న మిల్లులకు బియ్యం రవ్వకు, బయట మండలా ల్లోని రైస్‌ మిల్లుకు ఐషర్‌ వాహనాల ద్వారా తరలిపోతాయి. ఈ దందాపై జిల్లా విజిలెన్స్‌ అధికార్లు 6 ఏ కేసులు నమో దు చేస్తూనే ఉన్నారు. 2021 జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లా విజిలెన్స్‌ అధికారులు సుమారు 300 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. పది మందిపై ఐదు కేసులు నమో దుచేశారు. అయినా ఈ రేషన్‌ బియ్యం మాఫియాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఈ దందాకు చెక్‌ పెట్టాలని జిల్లా అధికారులను స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఈ మాఫియా వల్ల తమ గ్రామానికి  చెడ్డ పేరు వస్తుందని గ్రామ ప్రజలే ఆవేదన చెందుతున్నారు.  

చర్యలు తీసుకుంటాం

– భానుకుమార్‌, సివిల్‌ సప్లయిస్‌, డిప్యూటీ తహసీల్దార్‌

బాధ్యతలు స్వీకరించి నెల రోజులే అయింది. ఇక్కడ జరుగుతున్న రేషన్‌ దందాపై ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది. రేషన్‌ బియ్యం అక్రమ నిల్వలకు సంబంధించి, కొనుగోళ్లు, విక్రయాలకు సంబంధించి ఎప్పుడు, ఎవరు సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2022-01-18T05:58:10+05:30 IST