రైస్‌..రైట్‌

ABN , First Publish Date - 2021-06-18T04:53:14+05:30 IST

కరోనా వేళ ఎవరి సమస్యలతో వాళ్లు ఉంటే బియ్యం మాఫియా రెచ్చిపోతోంది.

రైస్‌..రైట్‌
రేషన్‌ లారీలను పట్టుకున్న విజిలెన్స్‌ అధికారులు

రేషన్‌.. రీ సైక్లింగ్‌

కరోనా వేళ బియ్యం అక్రమ రవాణా

కిలో కొంటే రూ.పది.. అమ్మితే రూ.30

తెలంగాణ నుంచి డంపింగ్‌.. 

తెలుగు జిల్లాలే అడ్డా.. పెద్దలే మాఫియా  


కరోనా వేళ ఎవరి సమస్యలతో వాళ్లు ఉంటే బియ్యం మాఫియా రెచ్చిపోతోంది. దర్జాగా హైవే మీదుగానే రవాణాకు తెగబడుతోంది. ఎక్కడ వీలైతే అక్కడ రేషన్‌ బియ్యం కొనుగోలు చేసి వాహనాలకు ఎక్కించి అనుకున్న వైపు దూసుకుపోతు న్నారు.కర్ఫ్యూ వేళ పోలీసులు, నిఘా సిబ్బంది స్థానికంగానే ఉండాల్సి రావడంతో ఇదే అదునుగా భావించి తమ పని కానిస్తున్నారు. 

(ఏలూరు–ఆంధ్రజ్యోతి): 

రేషన్‌ బియ్యం తరలింపు ఇప్పుడేం కొత్త కాదు. చాలాకాలం నుంచి అంతో ఇంతో అండదండలు ఉన్న వ్యాపారులే అనుకున్న ప్రాంతానికి తరలిస్తున్నారు. కరో నా కాలంలో పేదలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్‌ ద్వారా బియ్యం పంపిణీ చేస్తు న్నారు. ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడుతున్న బియ్యం మీద మాఫియా కన్నుపడింది. ఎవరైనా బియ్యం తీసు కోకుండా వదిలి వేసేందుకు సిద్ధపడితే అలాంటి వారికి వల వేస్తున్నారు. కిలో రూ.10 చొప్పున కొనుగోలు చేస్తు న్నారు. స్థానిక రేషన్‌ ఇచ్చే వారు తమకు అనుకూలురే కావడంతో కొందరు వేలిముద్ర వేసి సరుకు మాత్రం వదిలేస్తున్నారు. దీనికితోడు ప్రత్యేకించి ఎక్కడైతే మిల్ల ర్లు దీనికి అనుకూలంగా ఉంటారో వారి వద్దకు చేర్చేం దుకే ఈ మాఫియా ప్రయత్నిస్తోంది. గడిచిన ఐదు నెలల్లోనే జిల్లావ్యాప్తంగా టన్నుల కొద్దీ బియ్యం పట్టుబ డింది. తెలంగాణ సరిహద్దులు దాటి జిల్లాలో బియ్యం లోడుతో ప్రవేశించిన వాహనాలు కొన్ని, అలాగే జిల్లాలో అక్కడక్కడా సేకరించి ఒకచోట పోగేసి ఆ తరువాత రవాణాకు సిద్ధమైన టన్నుల కొద్దీ బియ్యాన్ని విజిలెన్స్‌ బృందాలు  దాడులు చేసి స్వాధీన పర్చుకున్నాయి. 

ఎక్కడ నుంచి ఎక్కడికి

కోటా బియ్యం ఒక్కో నెలలో ఒక్కో రకంగా ఉంటుం ది. నాణ్యమైన బియ్యం వస్తే ఏ ఒక్కరు వదిలి పెట్టరు. కాస్త పట్టు తగ్గితే ఎక్కడికక్కడే వదిలేస్తారు. ఇలా వదిలేసిన టన్నుల కొద్దీ బియ్యం పక్కదారి పడుతు న్నాయి. ఈ మధ్య కాలంలో కొయ్యలగూడెం దగ్గర నుం చి ఏలూరు, పెదపాడు వరకూ అక్రమ బియ్యం రవా ణా సాగుతూనే ఉంది. అసలు ఇంతకీ ఈ కథేంటని అధికారులు ప్రశ్నించినప్పుడల్లా ఇది అసలు సరుకేనం టూ వారిని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తారు. పొరుగు జిల్లాకు చెందిన బియ్యం లోడులు హైవే మీదుగా అనుకున్న మిల్లర్లకు చేరుతూ ఉంటాయి. ముందుగా లారీలు వెళ్లే మార్గాన్ని పక్కదారి పట్టించేలా అందరికీ తెలిసేలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. తర్వాత రూటు మార్చి వేరే దారిలో రాత్రి వేళ ప్రయా ణించేలా జాగ్రత్త పడతారు. మండలస్థాయిలో ఎవరైనా అడ్డుపడితే వారిని సంతృప్తి పరిచేలా డ్రైవర్లకు కొంత రిజర్వు ఫండ్‌ ఉంచుతారు.. మూడో కంటికి తెలియ కుండా గుట్టుగా సాగే వ్యాపారంలో ఎవరి వాటా వారి దే. అందుకనే ఎవరు కిక్కురుమనరు. ఫిర్యాదులు చేయ రు. కథ సాఫీగా జరిగేలా చూసుకుంటారు.  

వే–బిల్లుల్లోనూ గందరగోళం 

బియ్యం పట్టుబడుతున్న మార్గాలన్నింటిలోనూ చెప్పే వ్యక్తుల తీరు ఒకోరకంగా ఉంటుంది. ఎక్కడికక్క డ వే బిల్లులు సృష్టించి రవాణాకు పచ్చజెండా ఊపుతు న్నారు. ఒకే వే–బిల్లును పదేపదే వినియోగిస్తున్నారు. ఇలా అడ్డదారులు తొక్కుతున్న బృందాలను అడ్డుకునేం దుకు విజిలెన్స్‌ సర్వ శక్తులూ ఒడ్డుతోంది. ముందస్తు సమాచారం రాబట్టి గంటల తరబడి నిరీక్షించి వచ్చి పోయే వాహనాలు గమనించి బియ్యం లోడు అని నిర్ధా రించుకున్న తరువాతే స్థానిక పోలీసు బృందాలు వీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వే బిల్లుల్లో ఉన్న గందరగోళాన్ని చేధించలేకపోతున్నారు. టన్నుల కొద్దీ బియ్యం రవాణా అవుతున్నా యంత్రాం గం చూసీచూడనట్లుగా వదిలేయడానికి కొంతమంది పెద్ద తలకాయలే కారణమా అని అనుమానాలు లేకపోలేదు. 

నూజివీడు టు మండపేట 

పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా 

హైవేపై విజిలెన్సు దాడి 

27 టన్నుల బియ్యం స్వాధీనం

ఏలూరు క్రైం/పెదవేగి, జూన్‌ 17:  పేదలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా హైవేపై విజిలెన్స్‌ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. నూజివీడుకు చెందిన ఒక వ్యాపారి రేషన్‌ బియ్యాన్ని అక్రమ మార్గంలో లారీల్లో మండపేటకు తరలిస్తున్నట్టు జిల్లా విజిలెన్స్‌ ఎస్పీ వరదరాజుకు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు విజిలెన్సు సీఐ విల్సన్‌, సీఎస్‌డీటీ ప్రమోద్‌కుమార్‌ సిబ్బందితో కలిసి గురువారం తెల్లవారు  జామున ఏలూరు సమీపంలోని దుగ్గిరాల బ్రిడ్జిపై వాహనాల తనిఖీ చేపట్టారు. కలపర్రు వైపు నుంచి వస్తున్న ఏపీ 16 టీసీ 8768, ఏపీ 35యు 3677 లారీలను ఆపి తనిఖీ చేశారు. ఆ లారీల్లో పీడీఎస్‌ బియ్యం బస్తాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేవు. లారీలో ఉన్న మొత్తం 27 టన్నుల బియ్యం, లారీలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 17 లక్షల 26 వేల 700 రూపా యలు ఉంటుందని తెలిపారు. లారీ యజమా నులుసుగ్గాల చక్రధరరావు, దేశాయి మదన్‌ మోహన్‌ రెడ్డి, డ్రైవర్లు పల్నాటి రమేష్‌, వెళ్ళ సత్యనారాయణ, అడపా శివయ్యలపై కేసు నమోదు చేశారు. ఈ బియ్యాన్ని మండపేటకు తీసుకువెళ్ళి అక్కడ కోళ్ళ ఫారాలకు అమ్ము తారని విజిలెన్స్‌ సీఐ విల్సన్‌ తెలిపారు. కార్డుదారుల నుంచి కిలో రూ.12 నుంచి   13లకు కొనుగోలు చేసి వారికి రూ.18 నుంచి 20 రూపాయల వరకూ విక్రయిస్తున్నారని తెలిపారు.

Updated Date - 2021-06-18T04:53:14+05:30 IST