Abn logo
Aug 11 2020 @ 20:40PM

రేషన్ బియ్యం తరలిస్తున్న లారీ సీజ్

పశ్చిమగోదావరి: తాడేపల్లిగూడెం బ్రహ్మానందరెడ్డి మార్కెట్లో నిలిపి ఉన్న అక్రమంగా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని అధికారులు పట్టుకున్నారు. సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ సీతారత్నం రాకను గమనించిన లారీ డ్రైవర్.. బండిని అక్కడే వదిలేసి పారిపోయాడు. ఈ లారీ ఖమ్మం జిల్లా నుండి వచ్చినట్లుగా అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ లారీలో సుమారు 17 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న లారీని నవాబ్ పాలెంలో ఉన్న సివిల్ సప్లయ్ గోడౌన్‌కు తరలించారు. రేషన్ బియ్యం తరలింపుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement