Abn logo
Nov 29 2020 @ 00:15AM

రేషన్‌ బియ్యం దొరికేసింది

  తెలంగాణ నుంచి కాకినాడ తరలిస్తుండగా పది లక్షల విలువైన 19 టన్నుల సరుకు పట్టివేత

జీలుగుమిల్లి, నవంబరు 28 : తెలంగాణ నుంచి ఆంధ్రాకు లారీలో అక్రమంగా తరలిస్తున్న పదిలక్షల విలువైన 19 టన్నుల రేషన్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ అధి కారులు దాడి చేసి పట్టుకున్నారు. జీలుగుమిల్లి సరి హద్దు రోడ్డు రవాణా చెక్‌ పోస్టు వద్ద విజిలెన్స్‌ సీఐ జీవీవీ నాగేశ్వరావు శనివారం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోహబూబాబాద్‌ జిల్లా బయర్లగంగారం మండలం గొర్లగూడెం నుంచి లారీలో డ్రైవర్‌ పి.పోలయ్య తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు రేషన్‌ బియ్యం తరలిస్తుండగా పట్టుకున్నారు. వీఆర్వో ముత్యాలరావు, సివిల్‌ సప్లయిస్‌ ఆర్‌ఐ టి.లక్ష్మి సమక్షంలో కేసు నమోదు చేశారు. తనిఖీల్లో తహసీల్దారు పి.రవికుమార్‌, ఎఫ్‌ఆర్‌వో ఎస్‌ఆర్‌ఆర్‌ వరప్రసాద్‌, ఏఎంవీఐ జి.ప్రణీత్‌కుమార్‌, ఎఫ్‌ఎస్‌వో వి.ధర్మారావు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement
Advertisement