రేషన్‌ దందాకు అడ్డా వలపర్ల

ABN , First Publish Date - 2021-03-03T04:52:13+05:30 IST

రేషన్‌ బియ్యం దందాకు అడ్డాగా వలపర్ల మారింది.

రేషన్‌ దందాకు అడ్డా వలపర్ల
పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆటో

తాజాగా 34 బస్తాల బియ్యం స్వాధీనం

మార్టూరు, మార్చి 2: రేషన్‌ బియ్యం దందాకు అడ్డాగా వలపర్ల మారింది. ఇక్కడ భారీగా బియ్యం పట్టుబడుతున్నా అక్రమార్కులు యథేచ్ఛగా సాగిస్తున్నారు. మంగళవారం కూడా భారీగా రేషన్‌ బి య్యం పట్టుబడినట్టు ప్రచారం జరిగింది. అయితే, 34 బస్తాల బియ్యా న్ని స్వాధీనం చేసుకున్నట్టు  ఎస్‌ఐ చౌడయ్య తెలిపారు. 

బరితెగిస్తున్న అక్రమార్కులు

కొంతమంది అక్రమార్కులు పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్‌ బి య్యాన్ని ఖరీదైన వ్యాపారంగా మార్చుకుంటున్నారు. ఈ వ్యాపారానికి మండలంలోని వలపర్లలో ఒక రైసు మిల్లును అడ్డాగా మార్చుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. గత సెప్టెంబరు 25న భారీగా 1860 రేషన్‌ బియ్యం బస్తాలను ఈ రైసు మిల్లు నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యాన్ని ఇతర రాష్ర్టాలకు, దేశాలకు ఎగుమతి చేసేందుకు అక్రమార్కులు రంగం సిద్ధం చేయగా మార్టూరు పోలీసులు దాడి చేసిపట్టుకున్నారు. ఇది మరువకముందే మరలా ఈ మిల్లు నుంచి దందా జరుగుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

రైస్‌ మిల్లు వద్ద నిఘా

ముందుగా అందిన సమాచా రమో, ఇతరత్రా కారణాలో తెలియదు గాని, మంగ ళవారం వేకువజామున ఎస్‌ఐ పి.చౌడ య్య తన సిబ్బంది తో కలిసి రైస్‌మిల్లు వద్ద నిఘా పెట్టారు. అక్కడ ఒక అశోక్‌ మిని లేలాం డ్‌ వాహనంలో 30 బస్తాలు, ప్రయాణికుల ఆటోలో నాలుగు బస్తాలలో ఉంచిన బియ్యాన్ని పోలీసు లు స్వాధీనం చేసుకున్నారు. 

అయితే, రైస్‌మిల్లులో భారీగా బియ్యం నిల్వలను తనిఖీలో గుర్తిం చారని, దాదాపుగా 400 బస్తాలు దాకా పోలీసులు పట్టుకున్నారని ప్రచారం జరిగింది. ఈ విషయమై ఎస్‌ఐ చౌడయ్య మాట్లాడుతూ  ఉదయం రైసుమిల్లులో భారీగా బియ్యపు నిల్వలు ఉన్నమాట వాస్తవ మేనన్నారు. అయితే,  రైసుమిల్లులో గతంలో జరిగిన దాడులకు సం బంధించి హై కోర్టు నుంచి బియ్యం విడుదల చేసుకోవడానికి వారికి ఆర్డరు వచ్చిం దని చెప్పారు. అప్పటి కేసుకు సంబంఽఽధించిన బియ్యపు నిల్వలు ఉన్నా యని ఆయన పేర్కొన్నారు.

34 బస్తాలు స్వాధీనం

మంగళవారం ఉదయం వలపర్ల- రామకూరు రోడ్డులో అశోక్‌ మినీ వాహనంలో 30, ఒక ఆటోలో నాలుగు బస్తాల్లో తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ చౌడయ్య సాయంత్రం విలేకరులకు తెలిపారు. రెండు వాహనాలతోపాటు, ఇద్దరు డ్రైవర్లును అదుపులోకి తీసుకొన్నట్టు చెప్పారు. ఈ బియ్యాన్ని పరిశీలించాలని తహసీల్దార్‌కు తెలిపినట్టు ఎస్‌ఐ పేర్కొన్నారు. 

Updated Date - 2021-03-03T04:52:13+05:30 IST