మూడు నెలలుగా అందని రేషన్‌

ABN , First Publish Date - 2021-04-12T04:57:14+05:30 IST

జగతి పం చాయతీ సూరిపుట్టుగ గ్రామస్థులకు గత మూడు నెలలుగా రేషన్‌ సరుకులు అంద డంలేదు. దీంతో వారు ఆదివారం ఆందోళన కు దిగారు. గత ఏడాది డిసెంబరు, ఈ ఏడాది జనవరి, ఏప్రి ల్‌ నెలల సరుకులు పూర్తిగా అందలేదని వాపోయారు.

మూడు నెలలుగా అందని రేషన్‌
ఆందోళ చేస్తున్న మహిళలు

సూరిపుట్టుగ గ్రామస్థుల ఆందోళన 

కవిటి: జగతి పం చాయతీ సూరిపుట్టుగ గ్రామస్థులకు గత మూడు నెలలుగా రేషన్‌ సరుకులు అంద డంలేదు. దీంతో వారు ఆదివారం ఆందోళన కు దిగారు. గత ఏడాది డిసెంబరు, ఈ ఏడాది జనవరి, ఏప్రి ల్‌ నెలల సరుకులు పూర్తిగా అందలేదని వాపోయారు. డిసెంబరు రేషన్‌కు వలంటీర్‌ వేలిముద్ర వేయలేదని, జనవరి నెల డీలర్‌ డీడీ తీయలేదని, ఏప్రిల్‌లో 90శాతం మాత్రమే సరకులు వచ్చాయన్న కారణాలతో  పంపిణీ చేయలేదని వాపోయారు. రేషన్‌పైనే ఆధారపడి తాము జీవిస్తున్నామని, సరుకుల అందక పోవడంతో ఇబ్బందిపడుతు న్నామని తెలిపారు. జగతిలోని ఎనిమిదో రేషన్‌షాపు లోనే కార్డులను కొనసాగించా లని లబ్ధిదారులు కోరారు. దీనిపై తహసీల్దార్‌ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. 

Updated Date - 2021-04-12T04:57:14+05:30 IST