Abn logo
Oct 24 2021 @ 00:43AM

మూడు కిలోమీటర్లు వెళితేనే రేషన్‌

పుట్టపర్తిరూరల్‌, అక్టోబరు 23: మండలపరిధిలోని పలుగ్రామాల్లో రేషన్‌ కావాలన్నా, సచివాలయ ఉద్యోగులు తమ హాజరుకు సంబంధించి బయోమెట్రిక్‌ వే యాలన్నా కొండలైనా ఎక్కాలి లేదా ఊరికి మూడు కిలోమీటర్ల దూరమైనా వెళ్ళా ల్సిందేనని సచివాలయ ఉద్యోగులు, గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు మండల పరిధిలోని దిగువచెర్లోపల్లి పంచాయతీ పరిధిలోని గంగిరెడ్డిపల్లి, సాతార్లపల్లి  మూ డు గ్రామాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలైన రేషన్‌, పింఛన్‌, వంటి పథకాలను పొం దాలంటే కొండలు ఎక్కలేక వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎరుర్కొం టు న్నామని అవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్‌ ఇవ్వాలన్నా ఈ అవస్థలు తప్పడం లేదు. నెలనెల రేషన్‌ ఇవ్వాలంటే ఈపాస్‌యంత్రం, డివైజర్‌ తీసుకొని లబ్ధిదారులను వెం టబెట్టుకొని కొండలు ఎక్కాలి లేదా ఊరికి మూడు కిలోమీటర్లు దూరమైనా వెళ్లాల్సి వస్తోంది. సచివాలయాల్లో కంప్యూటర్లు మోరాయింపులతో  ప్రభుత్వ పథకా లు పొం దాల్సిన వారు ఇచ్చిన దరఖాస్తులు అప్లోడ్‌ చేయాలన్నా, 1బీ అడంగల్‌ పొం దాల నుకొ నే వారు ఎన్నో ఇబ్బందులు పడాల్సివస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నా రు. ఉన్నతాధికారులు స్పందించి  తమను అదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.