62 శాతం కార్డులకే రేషన్‌!

ABN , First Publish Date - 2022-07-29T05:47:32+05:30 IST

ఉచిత రేషన్‌ బియ్యం పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆగస్టు 1 నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి కేంద్రం అందించే ఉచిత రేషన్‌ బియ్యం సరఫరా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్పష్టమైన ఆదేశాలు జారీచేయడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చింది. కానీ పూర్తిస్థాయిలో రేషన్‌ అందే పరిస్థితులు కనిపించడం లేదు. కేవలం ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ (నేషనల్‌ పుడ్‌ సెక్యూరిటీ యాక్స్‌) కార్డుదారులకే ఈ బియ్యాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. జిల్లాలో 6,58,167 కార్డులు ఉంటే... ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డులు 4,10,159 ఉన్నాయి. వీరికి మాత్రమే ఉచిత బియ్యం అందజేయనున్నారు. అంటే 62 శాతం కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రేషన్‌ కార్డుల్లో జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) కింద కొన్ని కార్డులు గుర్తించారు. నాలుగేళ్ల కిందట ఈ ప్రక్రియ చేపట్టి వీటికి ప్రత్యేక స్టిక్కరును సైతం అంటించారు. వీటికి మాత్రమే ఉచిత బియ్యం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

62 శాతం కార్డులకే రేషన్‌!

 ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ కార్డులకే ఉచిత బియ్యం

(ఇచ్ఛాపురం రూరల్‌)

డీలర్లలో ఆందోళన

రేషన్‌ డీలర్ల పరిస్థితి అయోమయంగా తయారైంది. గతంలో సార్టెక్స్‌ బియ్యాన్ని నెలలో మొదటి 15 రోజులు ఎండీయూలకు లిప్టింగ్‌ చేసేవారు. మిగిలిన సగం రోజులు కేంద్ర బియ్యాన్ని తమ డిపోల ద్వారా ఇచ్చేవారు. ప్రస్తుతం ఉదయం కిలో రూపాయి కింద పంపిణీ చేసే బియ్యాన్ని ఎండీయూల ద్వారా అందజేసి, మధ్యాహ్నాం చౌకదుకాణం వద్దకు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయను న్నారు. పంపిణీపై రేషన్‌ డీలర్లు ఆందోళన పడుతున్నారు. నిలదీతలు ఎదురయ్యే అవకా శముందని భయపడుతున్నారు. ఈ-పాస్‌లో మాత్రమే ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ కార్డుల వివరాలు న్నాయి. అయితే కార్డు పరిశీలించిన అనంతరం ఈ-పాస్‌లో ఉన్నవారికే బియ్యం ఇస్తారు. లేని వారికి తిరిగి పంపాల్సిన పరిస్థితి ఉంది.

Updated Date - 2022-07-29T05:47:32+05:30 IST