రేషన్‌ పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం

ABN , First Publish Date - 2022-08-02T05:06:50+05:30 IST

వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్‌ పంపిణీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు.

రేషన్‌ పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం
వినతిపత్రం అందజేస్తున్న టీడీపీ నాయకులు


టీడీపీ నేతలు
విజయనగరం రూరల్‌, ఆగస్టు 1
: వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్‌ పంపిణీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. విజయనగరం తహసీల్దారు బంగార్రాజుకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు కర్రోతు నర్సింగరావు, బొద్దల నర్సింగరావు, ప్రసాదుల లక్ష్మీవరప్రసాద్‌లు మాట్లాడుతూ, ప్రజా పౌరసరఫరాల వ్యవస్థలో నూతన విధానం అంటూ మార్పులు చేశారని, దీనివల్ల ప్రజలకు ఎటువంటి ప్రయోజనం కలగడం లేదన్నారు. రేషన్‌ డీలర్లే గతంలో ప్రతి నెలా నిర్దేశించిన సమయంలో సరుకులు ఇచ్చేవారని, ఇప్పుడు వాహనాల ద్వారా సరుకులు ఎప్పుడిస్తారో? తెలియని పరిస్థితి ఉందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కనకల మురళీమోహన్‌, కంది మురళీనాయుడు, గంటా పోలినాయుడు, పొగిరి పైడిరాజు, గొల్లకోటి శివ తదితరులు పాల్గొన్నారువి


Updated Date - 2022-08-02T05:06:50+05:30 IST