నేటి నుంచి రేషన్‌ పంపిణీ

ABN , First Publish Date - 2020-08-04T11:02:52+05:30 IST

జిల్లాలోని రేషన్‌ కార్డుదారులకు మంగళవారం నుంచి సరుకులను పంపిణీ చేయనున్నారు.

నేటి నుంచి రేషన్‌ పంపిణీ

 9వ విడతలోనే ఉచితంగానే అందజేత

 91,602 బియ్యం కార్డుదారులకు లబ్ధి


నెల్లూరు(హరనాథపురం), ఆగస్టు 3 :  జిల్లాలోని రేషన్‌ కార్డుదారులకు మంగళవారం నుంచి సరుకులను పంపిణీ చేయనున్నారు. జిల్లాలోని 91,602 బియ్యం కార్డుదారులకు ఈ  పంపిణీ జరుగనుంది. ఉచితంగా బియ్యం, కందిపప్పును 9వ విడత రేషన్‌లో పంపిణీ చేయనున్నారు. ఈనెల 15వ తేదీ వరకు  దీన్ని కొనసాగిస్తారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు  పంపిణీ జరుగుతుంది. కార్డుదారులకు అరకేజీ చక్కెర రూ.17లకు ఇస్తారు.


జాగ్రత్తలు పాటించాలి ..బాలకృష్ణారావు, డీఎస్వో

కార్డుదారులు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ రేషన్‌ సరుకులు తీసుకోవాలి. సామాజిక దూరం తప్పకుండా పాటించాలి. కార్డుదారుల కోసం డీలర్లు సబ్బు, టవల్‌, వాటర్‌ అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతిరోజు 50 నుంచి 100 మందికి కూపన్లు ఇచ్చి సరుకులు పంపిణీ చేయిస్తాం. పోర్టబిలిటీ సౌకర్యం కూడా కల్పించాం. అదనపు కౌంటర్లను కూడా ఏర్పాటు చేయించాం.

Updated Date - 2020-08-04T11:02:52+05:30 IST