గడువులోగా బియ్యం పంపిణీ చేస్తాం : జేసీ లక్ష్మీశ

ABN , First Publish Date - 2021-03-05T06:05:22+05:30 IST

మొబైల్‌ డిస్పెన్సివ్‌ యూనిట్‌ (ఎండీయూ) విధానం ద్వారా లబ్ధిదారులకు గడువులోగా రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తామని జేసీ డాక్టర్‌ జి.లక్ష్మీశ తెలిపారు.

గడువులోగా బియ్యం పంపిణీ చేస్తాం : జేసీ లక్ష్మీశ

 కాకినాడ, మార్చి4 (ఆంధ్రజ్యోతి): మొబైల్‌ డిస్పెన్సివ్‌ యూనిట్‌ (ఎండీయూ) విధానం ద్వారా లబ్ధిదారులకు గడువులోగా రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తామని జేసీ డాక్టర్‌ జి.లక్ష్మీశ తెలిపారు. కాకినాడలో వివిధ డివిజన్‌లలో బియ్యం పంపిణీ ప్రక్రియను జిల్లా సప్లయి అధి కారి (డీఎస్‌వో) పి.ప్రసాదరావు, అర్బన్‌ మండల సప్లయి అధికారి మురళీకృష్ణతో కలిసి ఆయన పరీశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో 47 ఎండీయూ వాహనాలున్నాయన్నారు. ఈ నెలలో 77511 బియ్యం కార్డులకు గాను, ఇప్పటి వరకు 19512 కార్డుదారులకు సరుకులు పంపిణీ పూర్తి చేశామన్నారు. ఈ నెల నుంచి పోర్టబులిటీ అందుబాటులోకి వచ్చిందన్నారు. బయోమెట్రిక్‌లో వేలి ముద్ర పడని వారికి ఫ్యూజన్‌ ఫింగర్‌ ద్వారా వలంటీర్ల సహాయంతో పంపిణీ చేస్తున్నామన్నారు.  స్లమ్‌ ఏరియాల్లో ఈ నెలకు బియ్యం కూప న్లు ఇచ్చామన్నారు. 

ఇంటింట రేషన్‌ పంపిణీ పరిశీలన  

సర్పవరం జంక్షన్‌: ఇంటింటికీ రేషన్‌ పంపిణీ ప్రక్రియను గురువారం కాకినాడ రూరల్‌ మండలం తిమ్మాపురంలో జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీశ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మొబైల్‌ డెలివరీ యూనిట్ల ద్వారా సరఫరా అవుతున్న రేషన్‌ పంపిణీపై కార్డుదారుల అభిప్రా యాలను అడిగి తెలుసుకున్నారు. ఫిబ్రవరి నెల రేషన్‌ సరుకులు కార్డుదారులందరికీ పంపిణీచేశామని చెప్పా రు. జేసీ వెంట తహశీల్దార్‌మురళీకృష్ణ, వీఆర్వో ఉన్నారు. 


Updated Date - 2021-03-05T06:05:22+05:30 IST