Abn logo
Oct 27 2021 @ 00:00AM

రేషన్‌ డీలర్ల నిరసన

ఖాళీ రేషన్‌ గోతాలతో నిరసన వ్యక్తం చేస్తున్న డీలర్లు

అద్దంకి టౌన్‌, అక్టోబరు 27: జీవో నెం.10ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రేషన్‌ డీలర్లు స్థానిక ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్ద ఖాళీ గోతాలతో బు ధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డీలర్ల సంఘం మండల అఽధ్య క్షుడు మోటుపల్లి శివరామకృష్ఱ (చిన్న) మాట్లాడుతూ ఖాళీ గోతాలను ప్రభు త్వం వెనక్కి తీసుకోకుండా తమకే ఇవ్వాలన్నారు. వీటి ద్వారానే డీలర్లు షాపు ల అద్దె, ముఠా సిబ్బందికి డబ్బులు చెల్లించడం జరుగుతుందన్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న కమీషన్‌ను కూడా వెంటనే చెల్లించాలన్నారు. అనంతరం గోడౌన్‌ డీటీకీ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘ కార్యదర్శి బ న్ను, రఘురామగుప్త తదితరులు పాల్గొన్నారు.