మాకెలా న్యాయం చేస్తారో?

ABN , First Publish Date - 2020-11-29T06:06:06+05:30 IST

జనవరి నుంచి ఇంటిం టికీ రేషన్‌ డోర్‌ డెలివరీ విధానాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ఏర్పాట్లు వేగవంతం చేస్తున్న నేప థ్యంలో నేడు జరగనున్న కృష్ణాజిల్లా రేషన్‌ డీలర్ల సర్వసభ్య సమావేశంపై రాష్ట్రంలో రేషన్‌ డీలర్లంతా ఆసక్తితో ఉన్నారు.

మాకెలా న్యాయం చేస్తారో?

మొగల్రాజపురం, నవంబరు 28 : జనవరి నుంచి ఇంటిం టికీ రేషన్‌ డోర్‌ డెలివరీ విధానాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ఏర్పాట్లు వేగవంతం చేస్తున్న నేప థ్యంలో నేడు జరగనున్న కృష్ణాజిల్లా రేషన్‌ డీలర్ల సర్వసభ్య సమావేశంపై రాష్ట్రంలో రేషన్‌ డీలర్లంతా ఆసక్తితో ఉన్నారు. నగరంలో జరగబోయే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి కొడాలి నాని హాజరు కానుండటంతో జిల్లాలో అన్ని మండలాల డీలర్లతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల నేతలు, కార్యవర్గ సభ్యులు, డీలర్లు భారీగా హాజరయ్యేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట అధ్యక్షుడు మండాది వెంకట్రావు, కృష్ణాజిల్లా అధ్యక్షుడు ముత్యాల శే షగిరిరావు, విజయవాడ ప్రధాన కార్యదర్శి శివప్రసాద్‌ మాట్లాడుతూ డోర్‌ డెలివరీ విఽధానంలో గన్నీలను డీలర్ల నుంచి ప్రభుత్వం వాపసు తీసుకోవాలనే నిబంధన వెనక్కి తీసుకోవాలని, కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా మరణించిన డీలర్ల కుటుంబాలను ఆదుకోవాల ని, కేంద్రం నుండి డీలర్లకు రావాల్సిన 8 విడతల కమీషన్‌ ఇప్పించాలని వారు కోరారు. ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందనే నమ్మకంతో డీలర్లంతా వేచిచూస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-11-29T06:06:06+05:30 IST