రేషన్‌ డీలర్‌ లైసెన్స్‌ సస్పెండ్‌

ABN , First Publish Date - 2020-05-22T10:43:44+05:30 IST

నిబంధనలకు విరుద్ధంగా రేషన్‌ సరుకులను తక్కువగా సరఫరా చేస్తున్న డీలర్‌ లైసెన్స్‌ను పౌరసరఫరాలశాఖ అధికారులు సస్పెండ్‌

రేషన్‌ డీలర్‌ లైసెన్స్‌ సస్పెండ్‌

కూకట్‌పల్లి, మే 21 (ఆంధ్రజ్యోతి): నిబంధనలకు విరుద్ధంగా రేషన్‌ సరుకులను తక్కువగా సరఫరా చేస్తున్న డీలర్‌ లైసెన్స్‌ను పౌరసరఫరాలశాఖ అధికారులు సస్పెండ్‌ చేశారు. బాలానగర్‌ మండల ఏఎ్‌సవో అనిల్‌కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కూకట్‌పల్లి దయార్‌గూడలో 3384090 నెంబర్‌ గల రేషన్‌ దుకాణాన్ని శివశంకర్‌ నిర్వహిస్తున్నాడు. ఈయన కొంతకాలంగా సరుకులను అరకిలో చొప్పన తక్కువగా ప్రజలకు సరఫరా చేస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు గురువారం ఆ దుకాణంపై దాడులు నిర్వహించారు.


రేషన్‌ దుకాణంలో అక్రమాలు జరుగుతున్నట్లు వారు గుర్తించారు. వెంటనే ఆ దుకాణం లైసెన్స్‌ను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. సదరు రేషన్‌కు సంబంధించిన సరుకుల సరఫరా బాధ్యతను సమీపంలో ఉన్న రేషన్‌ దుకాణం నిర్వాహకుడు నాగేశ్వరరావుకు అప్పగించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి ఏ.రమేష్‌, డిఫ్యూటీ తహసీల్దార్‌ శ్రీనివా్‌సరెడ్డి, తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-05-22T10:43:44+05:30 IST