Abn logo
Jul 27 2021 @ 01:32AM

మృతులపేరిట రేషన్‌ కార్డులు: కాంగ్రెస్‌

భువనగిరి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న కాంగ్రెస్‌ కౌన్సిలర్లు, నాయకులు

 భువనగిరి రూరల్‌, జూలై 26: ఉప ఎన్నిక దృష్ట్యా మృతి చెందిన వారిపేరిట రేషన్‌ కార్డులు మంజూరు చేస్తున్నారని  మునిసిపల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ బర్రె జహంగీర్‌ ఆరోపించారు.  ఈ మేరకు భువనగిరి తహసీల్దార్‌ కార్యాల యం ఎదుట  సోమవారం ధర్నా నిర్వహించారు.  రేషన్‌ కార్డుల కోసం నూతన దంపతులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వ కుండా అనర్హులను ఎంపిక చేశారని ఆరోపించారు. అనంతరం తహసీ ల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పడిగెల రేణుక,  నర్సింహ, వెంకటేష్‌, నజీమాసలావుద్దీన్‌,  కె.దుర్గాభవానీ, గంగాఽ దర్‌, లక్ష్మీకృష్ణ, పాక వెంకటేష్‌, మహేందర్‌ పాల్గొన్నారు.