Abn logo
Dec 2 2020 @ 23:53PM

డీలర్ల ఆదాయానికి గండి

రేషన్‌ గోనెసంచుల రికవరీకి జీవో...అసలే అంతంతమాత్రం ఆదాయం...ఆ వేదనలో చౌక దుకాణాల డీలర్లు

ఏలూరు రూరల్‌, డిసెంబరు 2 : అసలే అత్తెస ర ఆదాయం. అది సరిపోక ఎప్పటి నుంచో కమీష న్‌ పెంచాలని రేషన్‌ డీలర్లు డిమాండ్‌ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బియ్యం సరఫరా అయ్యే గోనె సంచులు అమ్ముకుని ఖర్చు లు భరిస్తూ వస్తున్నారు. ఇటీవల గోనె సంచులను వెనక్కు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ నిర్ణ యించింది. గోరు చుట్టుపై రోకటి పోటుగా గోనె సంచులను రికవరీ చేయాలని జీవో నెంబర్‌ 10 ఇవ్వడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 2,260 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి.  12 లక్షల 85 వేల తెల్ల రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల న్నింటికి ప్రతీ నెలా సుమారు 10 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా చేయాలి. ఇవి సరఫరా చేసేందుకు ప్రతీ నెలా 20 లక్షలపైగా సంచులు కావాలి. జనవరి ఒకటో తేదీ నుంచి ఇంటింటికీ నా ణ్యమైన బియ్యం అందించాలని ప్రభుత్వం సంక ల్పించింది. డోర్‌ డెలివరీతో ఖర్చులు అధికంగా ఉంటాయన్న ఉద్దేశంతో డీలర్ల నుంచి సంచులు స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆదేశాలతో ఒక్కసారిగా డీలర్లు ఆందోళన చెందుతున్నారు. 1979–80 కాలంలో పౌరసరఫరాల సంస్థ ఏర్పడింది. 2004కు ముందు ఉమ్మడి రాష్ట్రం లో అప్పటి సీఎం చంద్రబాబు డీలర్లకు క్వింటాకు రూ.13 కమీషన్‌ చెల్లించేవారు. గోనె సంచులను డీ లర్లు అమ్ముకునే అవకాశం కల్పించారు. ఆ తరు వాత సీఎం జగన్‌ కమీషన్‌ను క్వింటాకు రూ.20 చేశారు. విభజన అనంతరం చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఈ–పోస్‌ వ్యవస్థను తీసుకువచ్చి డీలర్ల కమీషన్‌ను రూ.50 పెంచారు. గోనె సంచులు వారి కే కేటాయించారు. ఇప్పుడు తాజాగా వైసీపీ ప్రభు త్వం హయాంలో ఆహార భద్రత చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. గోనె సంచులు అమ్ముకుంటే సు మారు మూడు వేల నుంచి ఐదు వేల వరకూ ఆదాయం సమకూరేది. దాంతో షాపు మెయింటి నెన్సు, ఇతరత్రా ఖర్చులు పోయేవి. ఇప్పుడు గోనె సంచులు రికవరీ చేస్తే షాపు నిర్వహణ వ్యయం పెరుగుతుందని డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
Advertisement