అశేష భక్తుల నడుమ రథోత్సవం

ABN , First Publish Date - 2021-01-16T06:00:01+05:30 IST

రాంపురం రామలింగేశ్వరస్వామి మహా రథోత్సవం శుక్రవారం రమణీయంగా సాగింది. తుంగభద్రనది తీరాన ఆశేష భక్త జనవాహిని మధ్య అత్యంత వైభవంగా జరిగింది.

అశేష భక్తుల నడుమ రథోత్సవం
రాంపురంలో రథోత్సవం

  1. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు 


మంత్రాలయం, జనవరి 15: రాంపురం రామలింగేశ్వరస్వామి మహా రథోత్సవం శుక్రవారం రమణీయంగా సాగింది. తుంగభద్రనది తీరాన ఆశేష భక్త జనవాహిని మధ్య అత్యంత వైభవంగా జరిగింది. నాలుగు రోజులుగా విశేష పూజలు అందుకున్న రామలింగేశ్వరస్వామి రథోత్సవానికి కౌతాళం, కోసిగి, పెద్దకడుబూరు, మంత్రాలయం మండలాల నుంచి, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి, తెలంగాణ నుంచి వేలాది మంది భక్తులు వచ్చారు. ఈ కార్యక్రమం ఆలయ ధర్మకర్తలు పాటిల్‌ లలితమ్మ, మాజీ ఎంపీపీ సీతారామిరెడ్డి, ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిల ఆధ్వర్యంలో జరిగింది. శుక్రవారం ఉదయం స్వామి వారికి పంచామృతాభిషేకం, విశేష అలంకరణ నిర్వహించారు. సాయంత్రం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి రథం వద్దకు తీసుకొచ్చారు. రథోత్సవానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు రాంపురం రెడ్డి సోదరులు స్వాగతం పలికారు. భక్తుల జయజయ ధ్వానాల మధ్య రథోత్సవం సాగింది. రథం ముందు గొరవయ్యల నృత్యం, నందికోల, కోలాటాలు, భజన పాటలు భక్తులను అలరించాయి. రథోత్సవానికి విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. జనసందోహాంతో రాంపురం కిటకిటలాడింది. డీఎస్పీ వినోదుకుమార్‌ పర్యవేక్షణలో సీఐ కృష్ణయ్య, ఎస్‌ఐలు బాబు, యర్రన్న గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.  కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌ మాధవరం రామిరెడ్డి, వైసీపీ నాయకులు సీతారామిరెడ్డి యువ నాయకులు ప్రదీ్‌పరెడ్డి, ధరణిధర్‌రెడి,్డ భీమారెడ్డి, కృష్ణారెడ్డి, మురళీరెడ్డి, విశ్వనాథరెడ్డి, బాబు రెడ్డి, మాధవరం రాఘవేంద్రారెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2021-01-16T06:00:01+05:30 IST