అంగరంగ వైభవంగా..శ్రీవారి రథోత్సవం

ABN , First Publish Date - 2022-05-17T06:00:58+05:30 IST

అంగరంగ వైభవంగా..శ్రీవారి రథోత్సవం

అంగరంగ వైభవంగా..శ్రీవారి రథోత్సవం
రథోత్సవాన్ని వీక్షిస్తున్న భక్తులు

ద్వారకాతిరుమల, మే 16:  శ్రీవారి రథోత్సవాన్ని సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాత్రి ఆలయంలో ఉభయదేవేరులతో శ్రీస్వామి వారిని తొళక్కం వాహనంపై ఉంచి అలం కరించారు. ఆ తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాటభజనలు, అర్చకులు, ఆగమ విద్యార్థుల వేదమంత్రోచ్ఛరణల నడుమ వాహ నాన్ని అట్ట హాసంగా రథం వద్దకు తెచ్చారు. రథంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై కల్యాణ మూర్తులను ఉంచి అలంకరించి హారతులిచ్చారు. ఆ తరువాత విశేష వాయిద్యాలు, చిత్రవిచిత్ర వేష ధారణలు, డప్పు వాయిద్యాలు, కోలాట భజనలు, భక్తుల గోవింద నామాల నడుమ క్షేత్రపురవీధుల్లో తిరుగాడింది.





గోవర్ధన గిరిధారిగా చినవెంకన్న
గోవర్ధన గిరిధారి అలంకరణలో చినవెంకన్న సోమవారం భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ కృష్ణుడు యదుకులంలో ఉండగా దేవేంద్రుడు యాదవులపై కోపోద్రిక్తుడై రాళ్ల వర్షాన్ని కురి పించగా.. వారంతా కృష్ణుని వేడుకోవడంతో తన చిటికిన వేలితో ఆ పర్వతాన్ని ఎత్తారు..వారంతా దాని నీడన తలదాచుకున్న ఘట్టం ఆవి ష్కృతమవగా..గోవర్ధన గిరిధారి అలంకరణలోని శ్రీవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించారు.

Updated Date - 2022-05-17T06:00:58+05:30 IST