
కన్నుల పండువగా రథయాత్ర
భక్తి శ్రద్ధలతో పూజలు
ఇచ్ఛాపురం/పలాస,
జూలై 1: రథయాత్ర ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. యాత్రలో
అధికసంఖ్యలో భక్తులు పాల్గొని.. ‘జై జగన్నాథ’ అంటూ భక్తిశ్రద్ధలతో పూజలు
చేశారు. ఇచ్ఛాపురంలోని జగన్నాథాలయంలో రథయాత్ర ఉత్సవాలు కన్నులపండువగా
ప్రారంభమయ్యాయి. 15 రోజుల కిందట జ్యేష్ఠాభిషేకం అనంతరం తెరచాటుకు వెళ్లిన
స్వామి.. తొలిదశమి పురస్కరించుకుని భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధాన
అర్చకులు ప్రసాద్ సిద్ధాంతి, పద్మ కుమార్, రామకృష్ణ దివ్యరఽథంపై
జగన్నాఽథ, సుభద్ర, బలబద్ర ఉత్సవమూర్తు లను ఆశీనులను చేసి పూజలు
నిర్వహించారు. ఎమ్మెల్యే బెందాళం అశోక్ పూజలు చేశారు. రఽథంవీధి,
దాసన్నపేట, మెయిన్ రోడ్డు మీదుగా గుడించా గుడి వరకు రఽథయాత్ర సాగింది.
జగన్నాథుని దర్శించుకొనేందుకు వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. రథయాత్రలో
ఆలయ మేనేజర్ బెండి రామారావు, కమిటీ సభ్యులు మాటూరు సూర్యం, శ్రీనివాససాహు,
వీనస్ ప్రకాష్, శ్రీను దంపతులు, టౌన్ పోలీసులు పాల్గొన్నారు. పలాసలోని
సీతారామాలయం ప్రాంగణంలో వెలసిన జగన్నాథస్వామి మందిరం నుంచి రథయాత్ర ఘనంగా
ప్రారంభమైంది. రైల్వే ఆసుపత్రి రోడ్డులో వెలసి ఉన్న గుండిచా మందిరం వరకు ఈ
యాత్ర కొనసాగింది. మంత్రి సీదిరి అప్పలరాజు, శ్రీదేవి దంపతులు తొలిపూజ చేసి
యాత్రను ప్రారంభించారు. కార్యక్రమంలో మందిర కార్యదర్శి గిన్ని
జయశంకర్‌రెడ్డి, ఆలయ ధర్మ కర్తలు, భక్తులు పాల్గొన్నారు.