Facebook పేజీలో Fake Newsపై Ratan Tata హెచ్చరిక

ABN , First Publish Date - 2022-05-17T21:41:06+05:30 IST

ప్రముఖుల పేర్లతో సోషల్ మీడియాలో ఫేక్ పేజీలు క్రియేట్ చేయడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారుతోంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త..

Facebook పేజీలో Fake Newsపై Ratan Tata హెచ్చరిక

ముంబై: ప్రముఖుల పేర్లతో  సోషల్ మీడియాలో ఫేక్ పేజీలు క్రియేట్ చేయడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారుతోంది. తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా (Ratan Tata) పేరిట కూడా ఒక ఫేక్ ఫేస్‌బుక్ పేజీ (Fake Face book page) క్రియేట్ అయింది. ఆ ఫేస్‌బుక్ పేజీ (Facebook  page)లో తన పేరు, తన స్నేహితుల పేర్లను వాడుకుంటూ కొందరు తప్పుడు వార్తలను సర్క్యులేట్ చేస్తున్నారంటూ ఇన్‌స్టా‌గ్రామ్ స్టోరీస్‌లో టాటా మంగళవారం ఓ పోస్ట్ పెట్టారు. ఇలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.



రతన్ టాటా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌గా మూడు స్లైడ్స్‌ను గంట క్రితం పోస్ట్ చేశారు. రెండు స్లైడ్స్‌లో పిక్చర్స్‌‌తో కూడిన పేజ్‌ పోస్ట్ చేశారు. కొందరు సాయం పేరుతో డబ్బు కోసం తన స్నేహితుల పేర్లను వాడుకుంటూ అమాయక ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని టాటా పేర్కొంటూ ఆ పేజ్ స్క్రీన్‌షాట్ పోస్ట్ చేశారు. తాము ఏ రూపంలోనూ నిధులను అంగీకరించడం లేదని టాటా స్పష్టం చేశారు. ఆ పేజ్ లింక్‌ను కూడా టాటా ఇచ్చారు. అయితే, ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో ఆ పేజీ అందుబాటులో లేదంటూ చూపిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ చివరి స్లయిడ్‌లో రతన్ టాటా తన అఫీషియల్ ఈమెయిల్‌ను షేర్ చేస్తూ, రతన్ టాటా లేదా టాటా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌కు సంబంధించిన క్లయిమ్‌‌ ప్రామాణికతను తమను సంప్రదించి నిర్ధారించుకోవచ్చని సూచించారు. దయచేసి 'Talktous@tatatrusts.org' ద్వారా అవసరమైన నిర్ధారణ చేసుకోవాలని టాటా విజ్ఞప్తి చేశారు.




గతంలోనూ టాటా పేరుతో సోషల్ మీడియాలో తప్పుడు పోస్ట్‌లు వచ్చాయి. మద్యం అమ్మకాలకు ఆధార్‌ను లింక్ చేయాలంటూ టాటా చెప్పినట్టు ఆమె ఓ వార్త హల్‌చల్ చేసింది. ఆ వెంటనే ఆ వ్యాఖ్యలు తాను చేయలేదంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో టాటా పోస్ట్ పెట్టారు. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ భారీగా పతనమైనట్టు రతన్ టాటా చెప్పారని కూడా ఓ పోస్ట్ ఇటీవల వైరల్ అయింది. దానిపైనా టాటా వివరణ ఇచ్చారు.

Updated Date - 2022-05-17T21:41:06+05:30 IST