సీనియర్‌ సిటిజన్‌ సేవల స్టార్టప్‌లో రతన్‌ టాటా పెట్టుబడులు

ABN , First Publish Date - 2022-08-17T06:18:59+05:30 IST

సీనియర్‌ సిటిజన్లకు సేవలందించే స్టార్టప్‌ ‘గుడ్‌ ఫెలోస్‌’లో దేశీయ పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటా పెట్టుబడులు పెట్టారు.

సీనియర్‌ సిటిజన్‌ సేవల స్టార్టప్‌లో రతన్‌ టాటా పెట్టుబడులు

ముంబై: సీనియర్‌ సిటిజన్లకు సేవలందించే స్టార్టప్‌ ‘గుడ్‌ ఫెలోస్‌’లో దేశీయ పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటా పెట్టుబడులు పెట్టారు. ఎంత మొత్తం పెట్టుబడిగా పెట్టారన్న విషయా న్ని మాత్రం వెల్లడించలేదు. టాటా గ్రూప్‌ చైర్మన్‌ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత రతన్‌ టాటా వ్యక్తిగత హోదాలో ఇప్పటివరకు 50కి పైగా స్టార్ట్‌పలలో ఇన్వెస్ట్‌ చేశారు. గుడ్‌ ఫెలోస్‌ స్టార్ట్‌పను 30 ఏళ్ల శాంతను నాయుడు ప్రారంభించారు. అమెరికాలోని కార్నెల్‌ యూనివర్సిటీ పట్టభద్రుడైన నాయుడు.. టాటా పర్సనల్‌ ఆఫీ స్‌లో జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. 2018 నుంచి ఆయనకు సహాయకుడిగా ఉంటున్నారు. 

Updated Date - 2022-08-17T06:18:59+05:30 IST