ఐసీయూలో ఉన్న రోగిని ఎలుకలు కొరికాయ్.. ఆస్పత్రిలో ఇంత నిర్లక్ష్యమా..?

ABN , First Publish Date - 2021-06-24T01:46:33+05:30 IST

ప్రాణాపాయ స్థితిలో ఉండి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ (ఐసీయూ)లో చికిత్స తీసుకుంటున్న ఓ రోగి ఎలుకల బారిన పడ్డాడు.

ఐసీయూలో ఉన్న రోగిని ఎలుకలు కొరికాయ్.. ఆస్పత్రిలో ఇంత నిర్లక్ష్యమా..?

ప్రాణాపాయ స్థితిలో ఉండి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ (ఐసీయూ)లో చికిత్స తీసుకుంటున్న ఓ రోగి ఎలుకల బారిన పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని ఓ ఎలుక కరిచేసింది. ఆ గాయాన్ని అతని బంధువులు గుర్తించే వరకు వైద్యులు చెప్పలేదు. దీంతో రోగి బంధువులు హాస్పిటల్ ఎదుట ధర్నాకు దిగారు. ముంబైలోని బృహన్ ముంబై కార్పొరేషన్ హాస్పిటల్‌లో ఈ ఘటన జరిగింది. 


శ్రీనివాస్ (24) కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతూ మూడ్రోజుల క్రితం బృహన్ ముంబై కార్పొరేషన్ హాస్పిటల్‌లో చేరాడు. పరిస్థితి విషమించడంతో అతణ్ని ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. మంగళవారం అతని సోదరి అతని బుగ్గపై ఉన్న బ్యాండేజ్ గురించి ఆరా తీయగా ఎలుక కొరికొందని హస్పిటల్ సిబ్బంది చెప్పారు. ప్రమాదమేం లేదని, అది పెద్ద విషయం కాదని నచ్చ చెప్పబోయారు. దీంతో ఆమె ఇతర బంధువులకు విషయం చెప్పడంతో అందరూ హాస్పిటల్ ఎదుట ధర్నాకు దిగారు. హాస్పిటల్ సిబ్బంది తలుపులు వేయడం మర్చిపోయి ఉంటారని, అందువల్లే ఎలుక లోపలికి వెళ్లి ఉంటుందని, దానిని పెద్ద విషయం చేయవద్దని ముంబై మేయర్ అనడం మరింత ఆగ్రహానికి కారణమైంది. మేయర్ వ్యాఖ్యలపై ముంబై ఆప్ పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-06-24T01:46:33+05:30 IST