రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న బాధితుల రాస్తారోకో

ABN , First Publish Date - 2022-05-21T03:16:40+05:30 IST

మండలకేంద్రంలో జాతీయ రహ దారి విస్తరణలో ఇండ్లు, షాపులు కొల్పోతున్న వారం దరూ శుక్రవారం రహదారిపై రాస్తారోకో నిర్వహిం చారు. గత 50సంవత్సరాలుగా తాము రోడ్డు పక్కన వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసుకొని జీవనో పాధి పొందుతున్నామని అన్నారు.

రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న బాధితుల రాస్తారోకో
రోడ్డుపై కూర్చుని రాస్తారోకో చేస్తున్న బాధితులు

రెబ్బెన, మే 20: మండలకేంద్రంలో జాతీయ రహ దారి విస్తరణలో ఇండ్లు, షాపులు కొల్పోతున్న వారం దరూ శుక్రవారం రహదారిపై రాస్తారోకో నిర్వహిం చారు. గత 50సంవత్సరాలుగా తాము రోడ్డు పక్కన వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసుకొని జీవనో పాధి పొందుతున్నామని అన్నారు. ప్రస్తుతం రోడ్డు విస్తర్ణలో భాగంగా తమఇండ్లు,దుకాణాలు కొల్పో యి ఉపాధిఅవకాశాలు లేకుండా పోతున్నాయ న్నారు. రైల్వే ఆధీనంలో ఉన్న ఏడెకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి తమకుకొంత కేటాయించాలని డిమాండు చేశారు. విషయం తెలుసుకున్న ఆసి ఫాబాద్‌ ఆర్డీవో సిడాం దత్తు సంఘటన స్థలానికి వచ్చి సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్క రించటానికి తనవంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో బాధితులు ఆందోళన విరమిం చారు. కార్యక్రమంలో స్థానిక జడ్పీటీసీ సంతోష్‌, సర్పంచి ఆహల్యాదేవి, ఉపసర్పంచి శ్రీను, సుదర్శన్‌ గౌడ్‌, ఏఐటీయూసీ నాయకులు ఉపేందర్‌ తదిత రులు పాల్గొన్నారు. సీఐ నరేందర్‌, ఎస్సై భవానీ గట్టి బందోబస్తు నిర్వహించారు.

Updated Date - 2022-05-21T03:16:40+05:30 IST