తరుగు లేకుండా ధాన్యం కొనాలని రైతుల రాస్తారోకో

ABN , First Publish Date - 2022-05-17T03:55:36+05:30 IST

ధాన్యాన్ని తరుగు లేకుండా కొనుగోలు చేయాలని సోమవారం మండలంలోని తపాలాపూర్‌ చెక్‌పోస్టు వద్ద రైతులు రాస్తారోకో చేపట్టారు. మహమ్మదాబాద్‌, చింతగూడ, రోటిగూడ, తిమ్మాపూర్‌, రాంపూర్‌, తపాలాపూర్‌ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.

తరుగు లేకుండా ధాన్యం కొనాలని రైతుల రాస్తారోకో
రాస్తారోకో చేస్తున్న రైతులు

 జన్నారం, మే 16: ధాన్యాన్ని తరుగు లేకుండా కొనుగోలు చేయాలని సోమవారం మండలంలోని తపాలాపూర్‌ చెక్‌పోస్టు వద్ద రైతులు రాస్తారోకో చేపట్టారు. మహమ్మదాబాద్‌, చింతగూడ, రోటిగూడ, తిమ్మాపూర్‌, రాంపూర్‌, తపాలాపూర్‌ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.  రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించ డంలో అధికారులు విఫలమయ్యారని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్‌లు ఇవ్వాలని,  ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించాలని పేర్కొ న్నారు. తూకంలో నష్టపోతున్నామని, 40 కిలోలు తూకం వేయాల్సి ఉండగా 42, 43 కిలోలు వేస్తూ రైతులకు క్వింటాల్‌కు 7 కిలోల వరకు దోచుకుం టున్నారని పేర్కొన్నారు. కొందరు అధికారులు మిల్ల ర్లతో కుమ్మక్కై ధాన్యాన్ని ఇష్టారీతిన కోత పెడుతూ నష్టానికి గురి చేస్తున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించడంతోపాటు సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని తెలిపారు. 

రాస్తారోకోతో రోడ్డుకిరు వైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోడంతో  ఎస్‌ఐ సతీష్‌, అదనపు ఎస్‌ఐ తానాజీలు సంఘటన స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పినా వినలేదు.  తహసీల్దార్‌ కిషన్‌ రైతుల వద్దకు చేరుకుని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడంతో రాస్తారోకో విరమించారు. ధర్నాకు కాంగ్రెస్‌, బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీల నాయకులు మద్దతు పలికారు. పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ విజయధర్మ, సంఘాల నాయకులు మహేష్‌, కొమురయ్య, సత్యం, సత్యనారాయణ, శిరీష్‌, నర్సయ్య, జగన్‌, శ్రీనివాస్‌, రమేష్‌గౌడ్‌, రైతులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-05-17T03:55:36+05:30 IST