ఉపాధిహామీ కూలీల రాస్తారోకో

ABN , First Publish Date - 2021-04-16T06:58:59+05:30 IST

ఉపాధిహామీ కూలీలు రుద్రంగి మండల కేంద్రంలో గురువారం రాస్తారోకో చేశారు. నలుగురు చేసే పనిని ముగ్గురు కూలీలతో చేయిస్తున్నారని సుమారు 300 మంది ఉపాధిహా మీ కూలీలు రెండు గంటల పాటు కోరుట్ల- వే ములవాడ ప్రధాన రహదారిపై బైఠాయించారు.

ఉపాధిహామీ కూలీల రాస్తారోకో
రుద్రంగిలోని కోరుట్ల-వేవులవాడ ప్రధాన రహదారిపై బైఠాయించిన ఉపాధిహామీ కూలీలు

- రెండు గంటల పాటు వేములవాడ-కోరుట్ల ప్రధాన రహదారిపై  బైఠాయింపు

రుద్రంగి ఏప్రిల్‌ 15: ఉపాధిహామీ కూలీలు రుద్రంగి మండల కేంద్రంలో గురువారం రాస్తారోకో చేశారు. నలుగురు చేసే పనిని ముగ్గురు కూలీలతో చేయిస్తున్నారని  సుమారు 300 మంది ఉపాధిహా మీ కూలీలు రెండు గంటల పాటు కోరుట్ల- వే ములవాడ ప్రధాన రహదారిపై బైఠాయించారు. రుద్రంగి మండల కేంద్రం శివారులోని అటవీ ప్రాం తంలో దోనబండ ప్రాంతంలో భూగర్భజలాలు పెర గడం కోసం కండిత కందకాలను కొద్ది నెలల నుం చి సూమారు 200  నుంచి 300 మంది ఉపాధిహా మీ కూలీలు పని చేస్తున్నారు. ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ వర్షా కాలం, చలి కాలంలో క్యూబిక్‌ మీటర్‌ గుంతను తీయడానికి ముగ్గురు కూలీలు, అలాగే వేసవి కాలంలో అదే గుంతను తీ యడానికి నలుగురు కూలీలు అనే నిబంధన ఉండే దన్నారు. ప్రస్తుతం మండుటెండల్లో అదే ముగ్గురు కూలీలతో గుంతలను తీయాలని అధికారులు ఆదే శించారని, ఇది కష్టంగా మారిందని వాపోతున్నా రు. గతంలో కూలీరేటు  రూ. 301 ఉంటే ప్రస్తుతం రూ. 252 ఇస్తున్నారన్నారు. దీంతో పాటు నలుగు రు చేయాల్సిన పనిని, ముగ్గురితో చేయిస్తూ పని ఒత్తిడి పెంచి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.  పనులు జరిగే చోట తాగునీటీ సదుపాయం లేద ని, ఎవరైన గాయపడితే అత్యవసర సమయంలో ప్రథమ చికిత్సకు ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ కూడా అందు బాటులో లేకపోవడంపై ఆగ్రహంవ్యక్తం చేశారు.  

- పనులను బహిష్కరించిన కూలీలు..

ఉపాధిహామీ కూలీలు ధర్నా చేస్తున్న విషయా న్ని తెలుపుకున్న పోలీసులు, సర్పంచ్‌ తర్రె ప్రభల తామనోహర్‌లు అక్కడికి చేరుకోని కూలీలతో మా ట్లాడారు. ఉపాధిహామీ కూలీల కోసం అధికారులు గ్రామసభ ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తేనే పనులకు వెళ్తామని చెప్పి ధర్నా విరమించారు. పనులు జరిగే చోట అన్ని రకాల సదుపాయాలు క ల్పించాలన్నారు.  అనంతరం పనులను బహిష్కరి స్తున్నట్టు  చెప్పి కూలీలు అక్కడి నుంచి వెళ్లిపో యారు. కూలీలు రాస్తారోకో చేస్తున్న సమయంలో ఓ అంబులేన్స్‌ రావడంతో కూలీలు పక్కకు జరిగి దారి ఇచ్చారు. రుద్రంగి మండల కేంద్రంలో ఓ వ్యక్తికి ిసీరియస్‌ ఉండటంతో చందుర్తి మండల కేం ద్రం నుంచి రుద్రంగికి వస్తున్న అంబు లెన్స్‌కు దారి ఇచ్చారు అలాగే తిరిగి వెళ్తున్న సమయంలో కూడా కూలీలు దారి ఇచ్చి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. 

Updated Date - 2021-04-16T06:58:59+05:30 IST