ప్రమాదకరంగా ప్రయాణం

ABN , First Publish Date - 2020-12-06T03:28:21+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో రహదారులు అడుగడుగున ప్రమాదకరంగా మారాయని బీజేపీ జిల్లా కార్యదర్శి జంపాల మాల్యాద్రి నాయుడు అన్నారు

ప్రమాదకరంగా ప్రయాణం
రాస్తారోకో చేస్తున్న బీజేపీ జిల్లా కార్యదర్శి మాల్యాద్రి నాయుడు, నాయకులు

బీజేపీ జిల్లా కార్యదర్శి మాల్యాద్రి నాయుడు

రోడ్ల దుస్థితికి నిరసనగా రాస్తారోకో

నాయుడుపేట, డిసెంబరు 5 : రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో రహదారులు అడుగడుగున  ప్రమాదకరంగా మారాయని బీజేపీ జిల్లా కార్యదర్శి జంపాల మాల్యాద్రి నాయుడు అన్నారు. శనివారం నాయుడుపేట ఆర్టీసీ కూడలిలో ఆయన ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. గత ప్రభుత్వం రహదారుల మరమ్మతుల కోసం రూ.340 కోట్లు వెచ్చించేదన్నారు.ఈ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నరైనా రహదారుల మరమ్మతులకు నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికే అధ్వానంగా ఉన్న రహదారులు నివర్‌,  బురేవి తుఫాన్‌లతో భారీ గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయన్నారు. దాంతో ప్రయాణికులు ప్రమాదాలకు గురికావాల్సి వస్త్తోందన్నారు. గ్రామీణ రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా ఉందని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు.  ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్‌ రంగినేని కృష్ణయ్య, కోప్పోలు సుబ్రహ్మణ్యం, అమరావతి రామయ్య, ఎస్సీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి బి. విజయభాస్కర్‌, ప్రధాన కార్యదర్శి చిగురాకుల సురేంద్ర, న్యాయవాది ఆశ చెంచుకృష్ణయ్య, రాజశేఖర్‌రెడ్డి, కొండూరు సుబ్రహ్మణ్యంరాజు, ఏవీఎస్‌ రవీంద్ర, మండల అధ్యక్షుడు పత్తికోట రవి, సుందరరావు, హరికృష్ణ, గొర్రెపాటి కృష్ణ, నరేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-06T03:28:21+05:30 IST