రస్‌ మలాయి

ABN , First Publish Date - 2021-03-27T18:03:19+05:30 IST

పనీర్‌ కోసం: పాలు - ఒక లీటరు, నిమ్మరసం - రెండు టేబుల్‌స్పూన్లు, నీళ్లు - ఒక కప్పు. పంచదార పానకం కోసం: పంచదార - ఒకటిన్నర కప్పు, నీళ్లు - ఎనిమిది కప్పులు. రబ్డీ కోసం: పాలు - ఒక లీటరు, పంచదార - పావు కప్పు, యాలకుల పొడి - అర టీస్పూన్‌, కుంకుమ పువ్వు పాలు - రెండు

రస్‌ మలాయి

కావలసినవి:

పనీర్‌ కోసం: పాలు - ఒక లీటరు, నిమ్మరసం - రెండు టేబుల్‌స్పూన్లు, నీళ్లు - ఒక కప్పు. 

పంచదార పానకం కోసం: పంచదార - ఒకటిన్నర కప్పు, నీళ్లు - ఎనిమిది కప్పులు.

రబ్డీ కోసం: పాలు - ఒక లీటరు, పంచదార - పావు కప్పు, యాలకుల పొడి - అర టీస్పూన్‌, కుంకుమ పువ్వు పాలు - రెండు టేబుల్‌స్పూన్లు, పిస్తాలు - ఏడు, బాదం - ఐదు పలుకులు, జీడిపప్పు- పది పలుకులు.


తయారీ విధానం: ఒక పాత్రలో పాలు పోసి మరిగించాలి. తరువాత నిమ్మరసం పోసి కలపాలి. మరుగుతూ ఉన్నప్పుడు కలుపుతూనే ఉండాలి. చివరగా అదనంగా మిగిలిన నీటిని తీసేయాలి. అరగంట తరువాత గట్టిపడిన పనీర్‌ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న బాల్స్‌ చేసి పక్కన పెట్టుకోవాలి. నీళ్లు, పంచదార మరిగించుకుని పంచదార పానకం తయారు చేసుకోవాలి. తరువాత అందులో పనీర్‌ బాల్స్‌ వేయాలి. రబ్డీ తయారీ కోసం ఒక పాత్రలో పాలను మరిగించాలి. పాలు మరుగుతున్న సమయంలో పైన తేరుకునే మీగడను స్పూన్‌తో మరొక పాత్రలోకి తీసుకోవాలి. మళ్లీ పాలు మరిగించాలి. ఇలా ఐదు సార్లు మీగడ తీయాలి. తరువాత మిగిలిన పాలలో పంచదార, యాలకుల పొడి, కుంకుమ పువ్వు పాలు పోసి మరికాసేపు మరిగించాలి. ఈ రబ్డీ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో రెండు, మూడు గంటల పాటు పెట్టాలి. తరువాత పనీర్‌ బాల్స్‌పై రబ్డీ మిశ్రమాన్ని పోసి, నట్స్‌తో అలకంరిచాలి. చల్లని రస్‌మలాయిని ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. 


Updated Date - 2021-03-27T18:03:19+05:30 IST