Abn logo
Dec 3 2020 @ 09:36AM

నన్ను చూసి నేర్చుకోండి: రష్మిక

కన్నడ భామ రష్మిక ప్రస్తుతం తెలుగులో చాలా బిజీగా ఉంది. అటు స్టార్ హీరోల సినిమాల్లోనూ, ఇటు యువ హీరోల చిత్రాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ ఫుల్ స్వింగ్‌లో ఉంది. సుకుమార్-అల్లు అర్జున్ `పుష్ప` సినిమా చేస్తున్న రష్మిక.. ఇటీవల యువ హీరో శర్వానంద్ `ఆడాళ్లూ మీకు జోహార్లు` సినిమాను కూడా ప్రారంభించింది. 


మరోవైపు తమిళంలోనూ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఎంత బిజీగా ఉన్నా వ్యాయామం విషయంలో మాత్రం రష్మిక రాజీ పడదు. ఇంట్లో ఉన్నా, షూటింగ్‌లకు వెళ్లినా వర్కవుట్లు మాత్రం చేయాల్సిందే. తన వర్కవుట్ వీడియోలను రష్మిక ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంటుంది. తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేసిన రష్మిక.. `వర్కవుట్ చేయడానికి మీకందరికీ ప్రేరణ అవసరమా? నన్ను చూసి నేర్చుకోండి` అంటూ కామెంట్ చేసింది. 


Advertisement
Advertisement
Advertisement