Abn logo
Feb 27 2021 @ 09:51AM

విజయ్‌తో మూడోసారి రష్మిక?

విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా టాలీవుడ్‌లో హిట్ పెయిర్‌గా గుర్తింపు సంపాదించుకున్నారు. వీరిద్దరూ నాయకానాయికలుగా దర్శకుడు పరశురామ్ రూపొందించిన `గీతగోవిందం` బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లోనే తెరకెక్కిన `డియర్ కామ్రేడ్` కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. త్వరలోనే వీరి కాంబినేషన్‌లో మూడో సినిమా రాబోతోందట.

విజయ్ హీరోగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ రూపొందించనున్న సినిమాలో రష్మికనే హీరోయిన్‌గా తీసుకోవాలనుకుంటున్నారట. సుకుమార్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న `పుష్ప`లో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ షూటింగ్ సమయంలో రష్మిక నటన, అంకితభావం సుకుమార్‌కు చాలా నచ్చాయట. అందుకే తన తర్వాతి సినిమాలో కూడా రష్మికనే హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకుంటున్నాడట. అదే నిజమైతే మరోసారి విజయ్, రష్మిక తమ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఫిదా చేయడం ఖాయం. 

Advertisement
Advertisement
Advertisement