టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా వెలుగొందుతున్న కన్నడ భామ రష్మికా మందన్న ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమ పైనా దృష్టి సారించింది. హీరో కార్తి సినిమా `సుల్తాన్`తో కోలీవుడ్ అరంగేట్రం చేయబోతోంది. ఈ సినిమా ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
కోలీవుడ్లో మొదటి సినిమా కూడా విడుదలవక ముందే రష్మికను మరో క్రేజీ ఆఫర్ వరించిందట. కార్తి సోదరుడు, ప్రముఖ హీరో సూర్య సరసన నటించే ఛాన్స్ రష్మికకు వచ్చిందట. పాండిరాజ్, సూర్య కాంబినేషన్లో ఓ సినిమా రూపొందబోతోంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో సూర్య సరసన హీరోయిన్గా రష్మికను అనుకుంటున్నారట. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోందట.