Apr 21 2021 @ 15:51PM

డిఫరెన్స్ తెలియట్లేదంటున్న రష్మిక మందన్న!


రష్మిక మందన్న ప్రస్తుతం ఇటు సౌత్ అటు నార్త్ సినిమా ఇండస్ట్రీస్‌లో క్రేజీ ప్రాజెక్ట్స్‌లో అవకాశాలు అందుకుంటోంది. ఇదే క్రమంలో స్టార్ హీరోయిన్స్‌తో గట్టిగానే పోటీ పడుతోంది. టాలీవుడ్‌ హీరోయిన్స్‌తో పోల్చుకుంటే ఇప్పుడు టాప్ ప్లేస్‌లో ఉంది. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌గా రష్మిక మందన్న.. పూజా హెగ్డే‌తో సమానంగా సినిమా అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. తెలుగులో ప్రస్తుతం రష్మిక మందన్న పుష్ప సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నాడు. 5భాషల్లో రిలీజ్ కాబోతోన్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే 5 భాషల్లో రష్మిక క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పడం కష్టమే. 

కాగా బాలీవుడ్‌లో వరసగా రెండు సినిమాలు చేస్తోంది రష్మిక. యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా 'మిషన్ మజ్ఞు' షూటింగ్ దశలో ఉంది. అలాగే బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటిస్తున్న 'గుడ్ బై' సినిమా చేస్తున్న రష్మిక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూతురు పాత్ర పోషిస్తోంది. ఈ రెండు సినిమాలతో బాలీవుడ్‌లో సెటిలవ్వాలని చూస్తోంది. ఇక రీసెంట్‌గా తమిళ స్టార్ హీరో కార్తికి జంటగా సుల్తాన్ సినిమా చేసింది. తమిళ డెబ్యూతో రష్మిక మందన్నకి బాగానే పేరొచ్చింది. అయితే సినిమాల పరంగా మూడు ఇండస్టీస్‌లలో తనకి ఎలాంటి డిఫరెన్స్ కనిపించలేదని అంటోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించడం చాలా కంఫర్ట్‌గా ఉందని చెప్పుకొచ్చింది.