Oct 17 2021 @ 09:38AM

నెటిజన్‌కు షాకిచ్చిన రష్మిక..

స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్న తాజాగా ఓ నెటిజన్‌కు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చి షాకిచ్చింది. ప్రస్తుతం రష్మిక తెలుగుతో పాటు హిందీ సినిమాలతో యమా బిజీగా ఉంది. ఇప్పుడు తెలుగులో ఆమె అల్లు అర్జున్ సరసన పాన్ ఇండియన్ సినిమా 'పుష్ప' మూవీలో నటిస్తోంది. ఇందులో ఆమె శ్రీవల్లిగా డీగ్లామర్ రోల్‌లో కనిపించబోతుంది. ఇదే క్రమంలో యంగ్ హీరో శర్వానంద్ సరసన 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' అనే మరో ఫ్యామిలీ ఎంటర్‌మైంట్ మూవీలో నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి శర్వా - రష్మిక మందన్నల ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. 

ఈ పోస్టర్ చూసి అందరూ బావుందని మెచ్చుకుంటున్నారు. కానీ ఓ నెటిజన్ మాత్రం ట్విట్టర్‌లో..'ఎలా తీసుకున్నారురా దీన్ని ?' అంటూ రష్మిక ఫోటోను, నిర్మాణ సంస్థను ట్యాగ్ చేస్తూ కామెంట్ పెట్టాడు. సాధారణంగా ఇలాంటి కామెంట్ చేస్తే, ఏ హీరోయిన్ అయినా మడిపడుతుంది. కానీ రష్మిక చాలా కూల్‌గానే దిమ్మరిగేలా 'నా యాక్టింగ్ కోసం' అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో రష్మిక స్పోర్టివ్‌నెస్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కాగా ఆమె ప్రస్తుతం హిందీలోనూ నాలుగు ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉంది.