Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 05 Apr 2022 19:52:51 IST

అతడితో సినిమా... స్వప్నం సాకారమైనట్టుగా ఉందంటోన్న Rashmika!

twitter-iconwatsapp-iconfb-icon

అదృష్టం ఉండాలే కానీ... జీవితం ఓ కలలా సాగిపోతుంది. ఆ అదృష్టానికి అందం, అభినయం కూడా తోడైతే? రశ్మిక మందణ్ణ మాదిరిగా దూసుకుపోవటమే! ‘పుష్ప’ సినిమాతో మరో భారీ బ్లాక్‌బస్టర్ ఖాతాలో వేసుకున్న మన ‘గీతగోవిందం’ బ్యూటీ బాలీవుడ్ మీద సీరియస్‌గా చూపు సారించింది. అందుకే, అమితాబ్ బచ్చన్ మొదలు సిద్ధార్థ్ మల్హోత్రా వరకూ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ నటులతో చకచకా సినిమాలు చేసేస్తోంది. 


అమితాబ్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ‘గుడ్‌బై’ సినిమాలో రశ్మిక కీలకమైన క్యారెక్టర్‌లో కనిపించబోతోంది. అంతే కాదు, బిగ్ బీ లాంటి సీనియర్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటూనే సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి యంగ్ అండ్ హ్యాండ్సమ్‌తో ‘మిషన్ మజ్నూ’ మూవీ పూర్తి చేసింది. త్వరలోనే ఆ చిత్రం జనం ముందుకు రానుంది. అయితే, రశ్మిక మూడో హిందీ సినిమాగా ‘యానిమల్’ తెరకెక్కనుంది. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకి డైరెక్టర్. కాగా బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ ‘యానిమల్’ సినిమాలో హీరో! బీ-టౌన్ అందగాడితో ఆన్‌స్క్రీన్ రొమాన్స్ చేసే ఛాన్స్... ‘డ్రీమ్ కమ్ ట్రూ’ అంటోంది రశ్మిక!


ఏప్రెల్ 5న తన 26వ బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న కన్నడ క్యూటీ ‘యానిమల్’ సినిమా విషయంలో చాలా ఎగ్జైటెడ్‌గా ఉంది. స్టోరీ నచ్చటమే కాదు... సినిమాకు పని చేయబోయే టీమ్ మొత్తం అద్భుతం అంటోంది బెంగళూరు భామ. ఏప్రెల్ నెల చివర్లో ‘యానిమల్’ సినిమా రెగ్యులర్ షూట్ మొదలవ్వనుండగా ‘‘అస్సలు ఆగలేకపోతున్నా’’నంటోంది మిస్ మందణ్ణ!   

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement