Rashmika mandanna : ఈ హీరోకి అదృష్టదేవత అవుతుందా?

కన్నడ బ్యూటీ రష్మికా మందణ్ణ ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ లీగ్ లో ఉంది. స్టార్ హీరోలు, మీడియం రేంజ్ హీరోల సరసన నటిస్తూ మిగతా కథానాయికలకు గట్టి పోటీ గా మారింది. లాస్టియర్ ‘సరిలేరు నీకెవ్వరు, భీష్మ’ చిత్రాలతో మహేశ్ బాబు, నితిన్ లకు బిగ్గెస్ట్ హిట్సిచ్చిన అమ్మడు..  అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంలో శ్రీవల్లి పాత్రలో గ్రామీణ యువతిగా గ్లామర్ ను ఒలికించబోతోంది. అయితే ప్రస్తుతం ఆమె శర్వానంద్ సరసన కథానాయికగా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రంలో కూడా నటిస్తోంది. చాలా కీలకమైన పాత్రను పోషిస్తున్న రష్మికా.. ఈ మూవీతో శర్వానంద్ ఫ్లాపుల పరంపరకు ఫుల్ స్టాప్ పెడుతుందని నమ్మకంగా ఉన్నారు. శర్వా గత చిత్రాలు 5 కూడా ఫ్లాప్స్ గా ముద్ర పడడంతో ఇప్పుడు ఈ సినిమా మీదే ఆయన ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు. 


ఇంతకు ముందు ఫ్లాప్స్ లో ఉన్న నాగశౌర్య కి ‘ఛలో’ మూవీతోనూ, నితిన్ కి ‘భీష్మ’ మూవీతోనూ  లక్ తెచ్చిపెట్టిన రష్మికా మందణ్ణ అదే సెంటిమెంట్ తో ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రంతో శర్వానంద్ కీ అదృష్టదేవతగా మారుతుందని అంచనా వేస్తున్నారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్  ప్రస్తుతం సెట్స్ మీదుంది. డిఫరెంట్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. మరి ఈ సినిమాతో శర్వాకి నిజంగానే రష్మికా లక్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.  

Advertisement