Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 18 Jan 2022 19:58:13 IST

రాజ్ తరుణ్‌కి రష్మిక మందన్న సపోర్ట్

twitter-iconwatsapp-iconfb-icon
రాజ్ తరుణ్‌కి రష్మిక మందన్న సపోర్ట్

యంగ్ హీరో రాజ్ తరుణ్‌, వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘స్టాండప్ రాహుల్’. ఈ సినిమాతో శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్లపై నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ చిత్రంలోని ‘పదా’ అనే లిరికల్ సాంగ్‌ని.. హీరోయిన్ రష్మిక మందన్న తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


ఈ పాట విషయానికి వస్తే.. నలుగురు స్నేహితులు రోడ్ జర్నీ నేపథ్యంలో చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. అలాగే విజువల్స్‌లో రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మల మధ్య స్నేహానికి మించిన బంధమేదో ఉన్నట్టు కనిపిస్తోంది. మంచి మంచి లొకేషన్స్‌లో ఈ పాటని చిత్రీకరణ జరిగినట్లుగా విజువల్స్ చెబుతున్నాయి. కాగా, ఈ పాటకు రెహమాన్ సాహిత్యం అందించగా.. స్వీకర్ అగస్తి మంచి మెలోడీ ట్యూన్‌ను అందించారు. యాజిన్ నాజర్ ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement