Abn logo
Jul 3 2020 @ 19:50PM

చైతూకి సమంత, కీర్తి.. ఇద్దరూ కాదట

యువసామ్రాట్ నాగచైతన్య ప్రస్తుతం సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడనే వార్తలు ఈ మధ్య బాగానే వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ విషయమై రోజుకొక వార్త మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఈ సినిమాలో ముందు చైతూ భార్య సమంతనే హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సమంత ప్లేస్‌లోకి కీర్తి సురేష్ వచ్చి చేరింది. దాదాపు కీర్తి సురేష్ కన్ఫర్మ్ అంటూ వార్తలు వస్తున్న తరుణంలో వీరిద్దరి పేర్లు కాకుండా మరో హీరోయిన్ పేరు ఈ సినిమా విషయమై హైలెట్ అవుతుంది.


ప్రస్తుతం స్టార్ హీరోల సరసన అవకాశాలు పట్టేస్తూ.. టాలీవుడ్ టాప్ హీరోయిన్ రేసులో దూసుకుపోతోన్న రష్మికను ఈ సినిమా కోసం అనుకుంటున్నారట. సమంతను అసలు ఈ సినిమాకు అనుకోలేదని, అలాగే కీర్తిసురేష్ ఈ పాత్రలో తేలిపోతుందనే కారణాలు చెబుతూ.. రష్మికను చిత్రయూనిట్ ఫైనల్ చేసినట్లుగా టాక్ నడుస్తుంది. త్వరలోనే ఆమెను సంప్రదించి, అఫీషియల్‌గా న్యూస్ విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుందని అంటున్నారు. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.

Advertisement
Advertisement
Advertisement